HEALTH CARE Uncategorized

లేలేత కొబ్బరి తినడం వలన బహు లాభాలు….

లేత కొబ్బరి అనగానే మనకి గురు వచ్చేది కొబ్బరిబొండా…వేసవిలో ఎక్కువగా మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమైనది..కొబ్బరిబొండం తాగడం వలన మనకి ఎన్నో లాభాలు ఉన్నాయి…అంతేకాదు అవి తాగడానికి కాకుండా కొంతమంది దానిలో ఉన్న కొబ్బరి ని తినడానికి కూడా ఇష్టపడుతుంటారు…

వేసవికాలంలో దాహం వేసినప్పుడల్లా కొబ్బరినీళ్లు గుర్తు వస్తాయి.మరి వాటితోపాటు కొబ్బరి కూడా తినడం చాల మంచిది. లేత కొబ్బరి తినడం వలన ఎన్నో లాభాలు ఉన్నాయి..కొబ్బరిబోండం తాగడం వలన ఎన్ని లాభాలు ఉన్నాయో,అందులోని కొబ్బరి తినడం వలన కూడా అంతే లాభాలు ఉన్నాయి…

 

 

  • లేత కొబ్బరిలో పాల శాతం ఎక్కువగ ఉంటుంది.ముదిరిపోదు  కాబట్టి నూనెలు,కొవ్వులు ఉండవు.దీన్ని ఇతర పండ్ల రసాల తయారీలోనూ ఉపయోగిస్తే రుచికి రుచి ..ఆరోగ్యానికి మంచిది..
  • కప్పు లేత కొబ్బరిలో ఏడు గ్రాముల డైటరీ పీచు ఉంటుంది.ఇది జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగు పరుస్తుంది..మలబద్దకాన్ని దూరం చేస్తుంది..ప్రతోరోజు మన శరీరానికి ఎనిమిది గ్రాముల నుంచి ముప్పై ఎనిమిది గ్రాముల పీచు అవసరం అవుతుంది.ఈ కొబ్బరి తీసుకున్న సమస్య ఉండదు.సరిపడా పీచు అందుతుంది.
  • కప్పు లేత కొబ్బరిలో 283 కేలరీలు,పిండి పదార్తాలు ,పన్నెండు గ్రాములు,ఐదు గ్రాముల చక్కర,ఇంకా ఇతర విటమిన్లు,ఖనిజాలు అధికంగా లబిస్తాయి.దీన్ని గర్భిణీలు తీసుకోవచ్చు.నీళ్ల మాదిరే ఈ కొబ్బరి డిహైడ్రాషన్ ని దూరం చేస్తుంది

 

 

  • పాలుకారే కొబ్బరిలో ఫ్యాటీ యాసిడ్లు,కరిగే కొవ్వులు ఉంటాయి.ఇవి తీసుకోవడం వలన త్వరగా శరీరంలో కలిసి పోషకాల ను విడుదల చేస్తాయి.అవసరమైన శక్తిని అందిస్తాయి.
  • పొటాషియం,సోడియం కూడా లేత కొబ్బరిలో లబిస్తాయి.ఇవి శరీరానికి అందడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది.రక్తంలో పొటాషియం శాతం కూడా సమంగా ఉంటుంది.

 

  • ఇందులో విటమిన్ బి,ఫోలేట్స్ను ఎక్కువ.నీరసంగా అనిపించినప్పుడు కొద్దిగా కొబ్బరి తింటే ఉత్సహం సొంతం అవుతుంది.ఎర్ర రక్త కానాల వృద్ధి పెరుగుతుంది.చిన్నారులు తింటే ఎదుగుదల బాగుంటుంది..

 

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

GAVVA.IN