POLITICAL NEWS

ఏపి లో టిడిపికి కాంగ్రెస్ 45 స్థానాల లిస్టు: సోనియా హామీతో టిడిపి కి భ‌రోసా….!

కాంగ్రెస్ – టిడిపి అధినేత‌ల ఆక‌స్మిక క‌ల‌యిక‌తో తెలుగు రాజ‌కీయం రూటు మారింది. ఇప్ప‌టికే తెలంగాణ లో ఈ రెండు పార్టీలు క‌లిసి పోటీ చేస్తున్నాయి. మ‌రి..ఏపిలో సైతం ఈ పొత్తు కొన‌సాగుతుందా లేదా అనే చ‌ర్చ సాగుతున్న స‌మ‌యం లోనే..రెండు పార్టీల నేత‌ల మ‌ధ్య ఓపెన్ గా కాక‌పోయినా..ప‌రోక్షంగా సంకేతాలు ఇచ్చుకుంటున్నారు. ఏపిలో గ‌తం కంటే త‌మ ప‌రిస్థితి మెరుగైంద‌ని భావిస్తున్న కాంగ్రెస్ 45 స్థానాలు టిడిపి తో పొత్తులో భాగంగా కోరాల‌ని భావిస్తోంది. అందులో టిడిపి ఎంత వ‌ర‌కు ఇస్తుంద‌నేది చ‌ర్చ‌ల్లో ప‌ట్టుబ‌ట్ట‌వ‌చ్చ‌నేది వారి అంచ‌నా. ఇక‌, టిడిపి సైతం వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ రించి..ఏ నియోజ‌క‌వ‌ర్గంలో ఏ ర‌క‌మైన స‌మీక‌ర‌ణాల ఉన్నాయో..వాటిని దృష్టిలో పెట్టుకొని సీట్లు కేటాయించే అవ‌కాశం ఉంది. అయితే, తెలంగాణ ఎన్నిక‌ల ఫ‌లితాల తరువాత మాత్ర‌మే దీని పై తుది క‌స‌ర‌త్తు ప్రారంభించే అవ‌కాశం ఉంది…

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *