POLITICAL NEWS

శ్రీరెడ్డి వద్దు..షర్మిల కావాలంటున్న కేటీఆర్

టైటిల్ చూసేసి ఏదేదో ఉహించుకోవద్దు… అసలు విషయం ఏమిటంటే తన మీద తప్పుడు ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో తన పరువు తీస్తున్నారు అంటూ షర్మిల కేసు పెట్టింది. అది కూడా ఆంధ్ర లో కాకుండా తెలంగాణ లో పెట్టింది. అదేమిటంటే ఆంధ్ర పోలీసుల మీద నాకు నమ్మకం లేదు. అందుకే తెలంగాణాలో కేసు లో పెట్టాను అంటుంది షర్మిల. ఇక షర్మిల కంప్లంట్ ఇవ్వటం ఆలస్యం. వెంటనే తెలంగాణ పోలీసులు రంగంలోకి దిగారు. చక చక పనులు చేస్తూ షర్మిల మీద అసత్య ఆరోపణలు చేసిన వాళ్ళకి నోటీసులు ఇచ్చి వాళ్ళ వివరణ తీసుకునే పనిలో వున్నారు. అలాగే డిలీట్ చేసిన వీడియోస్ కోసం మళ్ళి యూట్యూబ్ కి రిక్వెస్ట్ చేసి ఆ వీడియోస్ తీసుకునే పనిలో వున్నారు.. ఒక ఆడబిడ్డ విషయంలో జరిగిన విషయంలో పోలీసులు స్పదింస్తున్న తీరు బాగుంది.

Sree Reddy

అయితే ఒక్కప్పుడు ఇదే తెలంగాణ పోలీసులకి శ్రీ రెడ్డి కూడా ఇలాగె తన మీద సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్న వారిమీద కేసు ఫైల్ చేసింది. ఒకటి కాదు రెండు సార్లు ఫైల్ చేసిన కానీ పట్టించుకున్న పాపాన పోలేదు.. శ్రీరెడ్డి అంతకుముందు ఎలాంటి పనులు అయినా చేయని, ఏమైనా మాట్లాడని , కానీ చట్టప్రకారం తనమీద జరుగుతున్నా తప్పుడు ప్రచారాన్ని ఎట్టి చూపిస్తూ కేసు పెట్టినప్పుడు దానికి తగ్గ చర్యలు పోలీసులు తీసుకోవాలి కానీ అలంటి చర్యలు ఏమి తీసుకోలేదు. అంటే శ్రీ రెడ్డికి ఒక న్యాయం షర్మిలకు ఒక న్యాయమా..? షర్మిల కంటే ఇంకా దారుణంగా శ్రీరెడ్డి గురించి వెబ్ మీడియా ప్రచారం చేసింది. అప్పుడు గుర్తుకురాలేదా ..? ఆడబిడ్డ యొక్క గౌరవం.. జగన్ మోహన్ గారి చెల్లెలు షర్మిల విషయం లోనే మీకు చట్టాలు రూల్స్ , సంప్రదాయాలు గుర్తుకువచ్చాయి అన్నమాట…ఈ విధంగా చుస్తే కెసిఆర్ ప్రభుత్వానికి శ్రీరెడ్డి లాంటి వాళ్ళు వద్దు..షర్మిల లాంటి వల్లే ముఖ్యం అని అనిపిస్తుంది.. చట్టాలు రూల్స్ అనేవి అందరికి ఒకేలా ఉండాలి తప్పితే డబ్బు పరపతిని చూసి మారకూడదు.. అయినా ఇలాంటి వాటి వెనుక రాజకీయాలు వుంటాయిలెండి. అప్పటిలో సినీ పెద్దలు రాజకీయం చేసి శ్రీరెడ్డి కేసు పక్కన పెట్టించారు. ఇప్పుడేమో రాజకీయ పెద్దలు పూనుకొని షర్మిల కేసుని పరుగులుపెట్టిస్తున్నారు ….

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *