POLITICAL NEWS

నాగబాబు అంటే రోజాకి భయమా? జగన్ ని విమర్శించినా రోజాకి కనిపించలేదా..? ఫైర్ బ్రాండ్ తుస్సుమందా ?

తెలుగు రాజకీయాల్లో లేడి ఫైర్ బ్రాండ్ ఎవరయ్యా అంటే కచ్చితంగా మరో మాట అనేది లేకుండా రోజా అనే చెపుతారు.. ప్రత్యర్థి రాజకీయ నాయకులమీద అదపులిలాగా విరుసుకుపడుతుంది రోజా.. ఇక జగన్ గురించి ఎవరు మాట్లాడిన సరే వాళ్ళకి దిమ్మతిరిగిపోయే రేంజే లో కౌంటర్ వేస్తుంది.ఏ విషయంలో కూడా వెనక్కి తగ్గని స్వభావం రోజా సొంతం. కాకపోతే నాగబాబు విషయంలో రోజా చాల సైలెంట్ గా ఉంటుంది.. నాగబాబు యూట్యూబ్ ఛానల్ రాజకీయ నాయకుల మీద పంచులు వేస్తూ హల చల్ చేస్తున్నాడు. ఇందులో భాగంగా జగన్ గురించి జగన్ అవినీతి గురించి ఒక వీడియో చేసాడు. ఆ వీడియో నెట్ లో ట్రేడ్నింగ్ కూడా అయ్యింది.. దీనితో వైస్సార్సీపీ కార్యకర్తలు కూడా సోషల్ మీడియా వేదికగా నాగబాబుకు కౌంటర్ ఇచ్చే పనిలో వున్నారు. అయితే తమ నాయకుడిమీద ఇలాంటి ఆరోపణలు చేసిన నాగబాబుని రోజా ఒక్క మాట అనలేదు. అయన వ్యాఖ్యలను కూడా ఖండించలేదు..

 

 

Naga babu and Roja

 

 

నాగబాబు జగన్ మీద వీడియో చేసిన తర్వాత చాల మంది రోజా రియాక్షన్ కోసం ఎదురు చూసారు. కానీ ఆమె నాకేమి సంబంధం అన్నట్లు ఉండిపోయింది. బహుశా ఒకే షోలో ఇద్దరు పక్క పక్కనే కూర్చోవాలి కదా అనుదుకేనేమో రోజా నాగబాబు ఒక్క మాట కూడా అనలేదు..యధావిధిగా ఒక నాగబాబు జగన్ మీద విమర్శలు చేయటం మాత్రం ఆపాడు. అసలే ఎలక్షన్స్ టైం ఇలాంటి టైములో తమ మీద తమ నాయకుడిమీద వచ్చే ఆరోపణలకు కౌంటర్లు ఇవ్వాలి. లేకపోతె వాటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దానికితోడు జగన్ మీద ఆరోపణలు చేస్తున్న నాగబాబు పక్కనే రోజు కూర్చొని పకపకా నవ్వటం చేస్తుంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం వుంది. అటు చుస్తే ఏమో పార్టీ. ఇటు చుస్తే ఏమో నాగబాబు తన నవ్వుల మెట్ ..దేనికి రోజా వదులుకోవడానికి సిద్ధంగా లేదు. మరి ఇలాంటి పరిస్థితి నుండి ఆమె ఎలా పడుతుందో చూడాలి.

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *