POLITICAL NEWS

కెసిఆర్ కి భారీ షాక్ ఇచ్చిన సర్వే : తెరాస పార్టీలో కలకలం

తెలంగాణ అంటే తెరాస..తెరాస అంటే కెసిఆర్ అనే విధంగా చేయటంలో కెసిఆర్ చాల విజయం సాధించాడు. మొన్న జరిగిన ఎన్నికలో తిరుగులేని మెజారిటీ సాధించి ప్రతిపక్షాలకు నోటి మాట లేకుండా చేసిన వైనం అందరికి తెలుసు. అదే ఊపులో రాబోవు పార్లమెంట్ ఎన్నికల్లోనూ హైదరాబాద్ స్థానం మినహా మిగిలిన అన్ని పార్లమెంట్ స్థానాలు కైవసం చేసుకోవాలని చూస్తున్నారు. అందుకు తగ్గట్లే మొన్న వచ్చినా ఒక జాతీయ సర్వే లో కూడా ఇవే మాటలు కనిపించాయి. హైదరాబాద్ అలాగే ఖమ్మం మినహా మిగిలిన అన్ని చోట్ల తెరాస వస్తుందని చెప్పారు.. అసెంబ్లీ ఎన్నికలో వచ్చిన ఓట్ల ప్రకారం చూసుకుంటే అది నిజమే అని అర్ధం అవుతుంది. కాకపోతే తాజాగా వచ్చిన టైమ్స్ నౌ సర్వే మాత్రం దానికి బిన్నంగా రిపోర్ట్ ఇచ్చింది.

 

 

KCR Governament

ఈ సర్వే ప్రకారం పార్లమెంట్ ఎన్నికల్లోకి కాంగ్రెస్ పుంజుకొని 5 సీట్లు సాదిస్తుందని, అలాగే బీజేపీ ఒకటి, MIM ఒకటి, ఇక మిగిలిన పది సీట్లు తెరాస ఖాతాలోకి వెళ్తాయని ఆ సర్వే చెప్పింది. గతంలో వచ్చిన సర్వే లో అసలు కాంగ్రెస్ కి ఒక సీటు రాదని చెప్పితే ఈ సర్వే లో మాత్రం ఏకంగా 5 సీట్లు వస్తాయని చెప్పటం విశేషం. అలాగే తెలంగాణ లో కెసిఆర్ ప్రభ మసకబారుతుందని, ఆయనకి ఓట్లు వేసి అసెంబ్లీ పంపాము. అదే చాలు ఇంకా ఈ పార్లమెంట్ ఎన్నికలో మాత్రం కాంగ్రెస్ వేద్దాం అనే ఆలోచన తెలంగాణా ప్రజల్లో వస్తుందని అందువలనే కాంగ్రెస్ పుంజుకునే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. దానికి తోడు మొన్న ఎన్నికలో కాంగ్రెస్ కి చెందిన మహామహులు సైతం ఓటమి చెందారు. దీనితో కాంగ్రెస్ కి కొంచం సానుభూతి కూడా కలిసివచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తుంది.. ఇలాంటి విషయాలు తెలియటంతో తెరాస లో కదలిక వచ్చింది. కళ్ళు మూసుకొని 16 సీట్లలో గెలుస్తాం అనుకున్న తెరాస వాళ్ళు తాజాగా సర్వే తో ఉలిక్కిపడి క్షేత్రస్థాయి పరిశీలన మొదలు పెట్టారని తెలుస్తుంది.. పోనిలే ఈ సర్వే తో అయినా ఎక్కడో వున్నా తెరాస వాళ్ళు కొంచం దిగివచ్చి తమ స్థాయి ఏమిటో అంచనా వేసే పనిలో పడ్డారు

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

GAVVA.IN