POLITICAL NEWS

చంద్రబాబు విషయంలో హద్దులు దాటకు..మామకి ఎన్టీఆర్ హెచ్చరిక ?

ఆంధ్ర లో ఎన్నికల వేడి రాజుకుంది. ఆ సూర్యుడి వేడికంటే కూడా ఈ వేడి ఎక్కువైంది. అధికారాన్ని మరోసారి నిలబెట్టుకోవాలని టీడీపీ, ఎలాగైనా సరే ఈ సరి మాత్రం అధికారం ఎక్కాలని వైస్సార్సీపీ పార్టీ తమ పూర్తీ బలాలను, బలగాలను బయటకు తీసి ఎన్నికల గోదాంలోకి దిగాయి.. విమర్శలు, ప్రతి విమర్సలు చేసుకుంటూ ప్రచారం చేస్తున్నారు. ఎన్టీఆర్ కి పిల్లని ఇచ్చిన మామ నార్నె శ్రీనివాస్ రావు వైస్సార్సీపీ పార్టీలో జాయిన్ అయ్యాడు. ఈయన స్వయంగా చంద్రబాబు నాయుడుకి దగ్గరి బంధువు. తాజాగా నార్నె శ్రీనివాస్ రావు ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ చంద్రబాబు మీద దారుణమైన వ్యాఖ్యలు చేసాడు. రాజకీయాల కోసం సొంత తమ్ముడినే పక్కకు నెత్తిన ఘనుడని, ఆయనకి ఆరోగ్యం బాగాలేకపోతే చూపించటం మానేసి ఒక గదిలో గొలుసులతో కట్టేసి హింసిస్తున్నారు అంటూ మాట్లాడటం జరిగింది. నార్నె చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారిపోయాయి.

దీనిపై అధికారికంగా నారా రోహిత్ మాట్లాడుతూ ఇలా ఆధారం లేని వ్యాఖ్యలు చేయటం మంచిది కాదు. మా ఫ్యామిలీ లో ఎవరికీ ఏమి కావాలో అన్ని సర్దుబాటు చేసే వ్యక్తి మా పెదనాన్న.. మా నాన్నగారికి ఆరోగ్యం బాగాలేకపోవటం వలన ఇంట్లోనే ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాం, ఇవేమి తెలియకుండా రాజకీయాల కోసం మా ఫ్యామిలీ గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకునేది లేదని ఖరాకండిగా చెప్పాడు.. అయితే దీనికంటే ముందే ఎన్టీఆర్ తన మామ నార్నె శ్రీనివాస్ రావు తో మాట్లాడుతూ, మీరు అనవసరంగా రాజకీయాల కోసం ఏవో ఏవో మాట్లాడటం మంచి పద్దతి కాదు. ఏమయినా ఉంటే రాజకీయంగా మాట్లాడండి, విమర్చించండి. అంటే కానీ ఇలా ఫ్యామిలీ విషయాలు పబ్లిక్ లో మాట్లాడటం మంచి పద్దతి కాదు. ఇక మీదట ఏమైనా ఉంటే కొంచం ముందు వెనుక ఆలోచించి మాట్లాడండి. బాబు విషయంలో ఎక్కడ హద్దులు దాటవద్దు అంటూ మాట్లాడినట్లు సమాచారం.

అందుకే ఆ తర్వాత నార్నె శ్రీనివాస్ ఎక్కడ కూడా చంద్రబాబు గురించి విమర్శించినా దాఖలాలు లేవు…మరి ఎన్టీఆర్ ఏ ఉద్దేశ్యంతో తన మామకి చంద్రబాబు గురించి పెద్దగా మాట్లాడమాకు అని చెప్పాడో మాత్రం ఎవరికీ అర్ధం కావటం లేదు..ఆలా మాట్లాడితే బాబు పర్సనల్ లైఫ్ కంటే కూడా పార్టీ కి నష్టమని బావించాడా..? లేక నారా రోహిత్ కూడా తోటి హీరోనే కదా ఆలా వాళ్ళ తండ్రి గురించి మాట్లాడటం కరెక్ట్ కాదని భావించాడు ఏమో కానీ మొత్తానికి మామని సైలెంట్ చేసేశాడు…

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

GAVVA.IN