POLITICAL NEWS

ఇకపై జబర్దస్త్ కి నాలుగైదు రోజులే : నాగబాబు

సినీ నటుడు నాగబాబు ఒక నటుడిగాకంటే కూడా జబర్దస్త్ ఫేమ్ నాగబాబుగా అందరికి పరిచయం,అయితే ఈ మధ్య ఆయన జనసేన పార్టీలో చేరి నర్సాపురం నుండి MP గా పోటీ చేశాడు..ఈ క్రమంలో అయన జబర్దస్త్ కి దూరంగా ఉంటున్నాడు, అలాగే మరో జడ్జ్ అయినా రోజా కూడా జబర్దస్త్ కి దూరంగా ఉంటుంది. ఆమె కూడా నగరి నుండి MLA గా పోటీ చేస్తుంది. ఇక వీళ్ళద్దరు వెళ్లిపోవటంతో జబర్దస్త్ కి శేఖర్ మాస్టర్ ని ఒక్కప్పటి హీరోయిన్ మీనా ని తీసుకోని వచ్చారు. అయితే జబర్దస్త్ లో నాగబాబు రోజా లేని లోటు బాగా కనిపిస్తుంది. ఒకవేళ నాగబాబు గెలిస్తే పూర్తిగా జబర్దస్త్ కి గుడ్ బై చెప్పేస్తాడనే ఊహాగానాలు ఎక్కువయ్యాయి.

దాని గురించి తాజాగా నాగబాబు మాట్లాడుతూ నేను MP గా గెలిస్తే జబర్దస్త్ కి దూరం అవుతాడని వస్తున్నా వార్తల్లో ఎలాంటి నిజం లేదు.. గెలిచిన తర్వాత కూడా నేను జబర్దస్త్ లో కనిపిస్తాను. నెలలో గట్టిగా ఉంటే నాలుగైదు రోజులు మాత్రమే ఉంటుంది. ఆ మాత్రం కేటాహించటం పెద్ద పనేమీ కాదు..ప్రేక్షకులను అలరించటం కంటే గొప్ప పనేమీ ఉంటుంది. కాబ్బటి నేను జబర్దస్త్ కి తప్పకుండా వస్తాను అంటూ అసలు విషయం చెప్పాడు. ఇక శివాజీరాజా ఇస్తానన్న రిటర్న్ గిఫ్ట్ గురించి మాట్లాడుతూ నిజానికి నాకు నరేష్ కంటే కూడా శివాజీరాజానే బాగా పరిచయం. కాకపోతే నరేష్ ఇంత వరకు పోటీచేయలేదు కదా ఒకసారి ఛాన్స్ ఇద్దామనే ఆలోచనతో మద్దతు ఇచ్చాను తప్ప మరో ఉద్దేశ్యం అయితే లేదు. కాకపోతే దానిని శివాజీ రాజా సీరియస్ గా తీసుకున్నాడు. నేను మాత్రం ఆ టాపిక్ ఎప్పుడో వదిలేసాను అంటూ చెప్పుకొచ్చాడు ..

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

GAVVA.IN