Games

ఐపీఎల్ లో కోల్ క‌తా ను క‌ట్ట‌డి చేయ‌లేక చ‌తికిల ప‌డ్డ స‌న్ రైజ‌ర్స్

  తాజాగా జ‌రిగిన ఐపీఎల్ 2 వ మ్యాచ్ లో  కోల్ క‌తా  మొద‌టి విజ‌యాన్ని న‌మోదు చేసింది .టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన స‌న్ రైజ‌ర్స్ నిర్ణీత  20 ఓవ‌ర్ల‌లో  3 వికెట్లు కోల్పోయి 182 ప‌రుగుల భారీ స్కోర్ సాధించింది   .ఈ భారీ స్కోర్ కావ‌డానికి ముఖ్య కార‌ణం వార్న‌ర్ అనే చెప్పాలి .ఒక వైపు నిల‌క‌డ‌గా ఆడుతేనే మ‌రో వైపు బౌండ‌రీలు సాధిస్తూ జ‌ట్టు స్కోరును భారీ ఆధిక్యం వైపు న‌డిపించారు .
                   ఈ భారీ స్కోర్ సాధించే దిశ‌లో బ్యాటింగ్ దిగిన కోల్ క‌తా నిల‌క‌డ‌గా ఆడుతూ రెండు బంతులు మిగిలి  ఉండ‌గానే  విజ‌యాన్ని చేజిక్కించుకుంది .  అయితే ఒక ద‌శ‌లో కోల్ క‌తా ఓట‌మి వైపు అడుగులు వేస్తుంద‌న్న స‌మ‌యంలో అండ్రూ ర‌సెల్  విరోచిత పోరాటం తోడ‌వ‌డంతో కోల్ క‌తా విజ‌యం సాధించింది.అండ్రూ ర‌సెల్   కేవ‌లం 19బంతులో 49 ప‌రుగులు చేసి  జ‌ట్టుకు విజ‌యాన్ని అందించారు.
                   కోల్ క‌తా త‌రుపున నితీష్ రాణ 68 ప‌రుగులు ,రాబిన్ ఉత‌ప్ప 35ప‌రుగులు చేశారు .కోల్ క‌తా చివ‌రు మూడు ఓవ‌ర్ల ల‌లో 50 ప‌రుగులు చేయాల్సి ఉన్న త‌రుణంలో….. కొంత టెంక్ష‌న్ నెల‌కొంది .అయితే  అండ్రూ ర‌సెల్ మంచి ఫామ్ లో ఉండ‌డంతో ఈ టెంక్ష‌న్ పోయి విజ‌యం చేరువైంది .

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *