Games

బ్రేకింగ్ న్యూస్… ఐపీఎల్‌ మధ్యలో వదిలి వెళ్తున్న విదేశీ ఆటగాళ్లు …

20 -20 క్రికెట్ లో ఇన్ని లీగ్ లు వచ్చిన కానీ ఐపీఎల్‌ కి పోటీ ఇచ్చే లీగ్ మరొకటి లేదనే చెప్పాలి. ఐపీఎల్‌ కి ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ఆడే దేశాల్లో విపరీతమైన ఆదరణ ఉంది. తాజాగా జరుగుతున్నా సీజన్ 12 కి కూడా మంచి trp రేటింగ్స్ వస్తున్నాయి. అలాగే hotstar లో కొన్ని లక్షల మంది ఐపీఎల్‌ ను చూస్తున్నారు. దీనికి ఇంత ఆదరణ రావటానికి ప్రధాన కారణం విదేశీ ఆటగాళ్లే అని చెప్పవచ్చు. మన జట్లకు వల్లే ప్రధాన ఆటగాళ్లు అయ్యారని చెప్పవచ్చు. హైదరాబాద్ కావచ్చు బెంగుళూర్ కావచ్చు, రాజస్థాన్ రాయల్స్ కావచ్చు వీళ్ళు ఎక్కవుగా విదేశీ ఆటగాళ్ల మీదే ఆధారపడ్డారని చెప్పవచ్చు. అయితే ఆయా జట్లు విదేశీ ఆటగాళ్లు టోర్నీ మధ్యలోనే వెళ్లిపోతున్నారు. దీనికి కారణం 2019 వరల్డ్ కప్.. ఇప్పటికే కొన్ని దేశాలు తమ జట్లు లను ప్రకటించాయి. ఆయా జట్టులో వున్నా ఆటగాళ్లు ఐపీఎల్‌ లో ఆడుతుంటే వెంటనే దేశానికీ రావాలని ఆదేశాలు జారీ చేసారు. దీనితో వెళ్ళిపోవటం తప్పనిసరి అయ్యింది.. వెస్టిండీస్ మాత్రం ఇంకా జట్టుని ప్రకటించలేదు కాబట్టి వాళ్ళు ఆడే ఛాన్స్ ఉంది. అలాగే న్యూజిలాండ్‌, అఫ్గానిస్థాన్‌ ఆటగాళ్లు కూడా ఐపీఎల్‌లో కొనసాగుతారు.. ఇందులో ముఖ్యంగా సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌కు కీలకంగా మారి ఎన్నో మ్యాచుల్లో విజయాలు తెచ్చిపెట్టిన వార్నర్‌, బెయిర్‌ స్టో వెళ్లిపోనుండటం ఆ జట్టుకు పెద్ద దెబ్బలాంటిదే. మరోవైపు రాజస్థాన్‌, బెంగళూరుది కూడా అదే పరిస్థితి.

వెళ్లిపోనున్న ఆటగాళ్లు

సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ : డేవిడ్‌ వార్నర్‌, జానీ బెయిర్‌ స్టో, షకిబుల్‌ హసన్‌.
చెన్నై సూపర్‌ కింగ్స్‌ : ఫాఫ్‌ డూప్లెసిస్‌, ఇమ్రాన్‌ తాహీర్‌.
ముంబయి ఇండియన్స్‌ : బెహ్రెండార్ఫ్‌, డికాక్‌.
కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ : డేవిడ్‌ మిల్లర్‌.
కోల్‌కతా నైట్‌రైడర్స్‌ : జో డెన్లీ
రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు : మొయిన్‌ అలీ, స్టోయినిస్‌, క్లసీన్‌, డేల్‌ స్టెయిన్‌.
రాజస్థాన్‌ రాయల్స్‌ : బట్లర్‌, స్టీవ్‌ స్మిత్‌, బెన్‌ స్టోక్స్‌, జొఫ్రా ఆర్చర్‌.
దిల్లీ క్యాపిటల్స్‌ : రబాడా

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *