Games

కర్త కర్మ క్రియ ఒక్కడే..అతడే మహేంద్రుడు…

మహేంద్ర సింగ్ ధోని ఈ పేరులోనే ఒక పవర్ వుంది. ఇండియా జట్టులోకి వచ్చిన కొత్తలో తన జులపాల జుట్టుతో, విధ్వంసకరమైన ఆటతీరుతో అందరికి అలరించాడు. ఆ తర్వాత అతి తక్కువ కాలంలోనే టీం ఇండియా కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించి రెండు వరల్డ్ కప్ లు అందించాడు. ఇలా ధోని ఘనతలు చెప్పుకుంటూ పొతే చాలా వున్నాయి. అయితే గత మూడేళ్ళ కాలంలో ధోని కెప్టేన్ గా, కీపర్ గా మాత్రమే రాణించాడు తప్పితే, బ్యాట్స్మన్ గా రాణించిన దాఖలాలు లేవు. దీనితో ధోని మీద విమర్శలు చేసే వాళ్ళు ఎక్కవ అయ్యారు. కానీ వాటికీ ధోని ఎప్పుడు నోటితో సమాధానం చెప్పలేదు. తన బ్యాట్ తోనే సమాధానం చెపుతున్నాడు..

ఇండియా పూర్తిస్థాయి కెప్టేన్ గా కోహ్లీ బాధ్యతలు తీసుకున్న తర్వాత ధోని విలువ ఏమిటో ఇంకా బాగా తెలిసివచ్చింది.. కెప్టెన్ కోహ్లీ అయినా కానీ దాదాపు చివరి 30 ఓవర్లు కెప్టెన్ కుర్చీలో కూర్చునేది ధోని అనే విషయం అందరికి తెలుసు.. ఇక తాజాగా జరుగుతున్నా 12 వ ipl లో ధోని బ్యాటింగ్ చేస్తున్న తీరు అద్భుతం.. ప్రస్తుతం ధోని వయస్సు 37 ఏళ్ళు .. ప్రొఫిషనల్ స్పోర్ట్స్ కి రిటర్మెంట్ ఇచ్చే వయస్సు, కానీ ధోని ని చుస్తే మరో ఐదేళ్లు కచ్చితంగా అదే సత్తా వున్నవాడిగా కనిపిస్తున్నాడు.. 37 ఏళ్ల వయసులోనూ కుర్రాళ్లతో పోటీ పడి పరుగుతీస్తాడు. వారిని ఓడిస్తాడు. తన ఫిట్‌నెస్‌కు తిరుగులేదని చాటుతున్నాడు.

అవతలి ఎండ్‌లోని బ్యాట్స్‌మన్‌ సమన్వయంతో చకచకా పరుగులు తీస్తాడు. ఐపీఎల్‌ 12వ సీజన్‌లోనూ అద్భుతంగా ఆడుతున్నాడు మహీ. 119.33 సగటుతో 8 ఇన్నింగ్సుల్లోనే 358 పరుగులు చేశాడు. అతడి సగటుకు దరిదాపుల్లో ఎవ్వరూ లేరు. రెండో స్థానంలోని రవీంద్ర జడేజా సగటు 38. దీనిని బట్టి చెప్పొచ్చు అతనెంత కసిగా ఆడుతున్నాడో. చెన్నై మొత్తం చేసిన పరుగుల్లో 19% మహీ చేసినవే. సీజన్‌లో మూడు అర్ధశతకాలు సాధించాడు. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు నిర్దేశించిన 162 పరుగుల లక్ష్య ఛేదనలో ధోనీ ఆట ఆసక్తి రేకెత్తించింది. ఒక వైపు వికెట్లు పడుతున్నా నిలకడగా ఆడాడు. ఆఖరి ఓవర్‌లో 4, 6, 6, 2, 6తో అదరగొట్టాడు. అయితే చివరి బంతిని వృథా చేయడం అర్థం కాలేదు. ఏదేమైనప్పటికీ చెన్నైకి కర్త, కర్మ, క్రియ ధోనీయే కావడం గమనార్హం.. చివరిగా ఒక మాట ఇప్పటికి కూడా ఒక్క చైన్నె కి మాత్రమే కాదు. టీం ఇండియా కి కూడా తగరని ఆస్తి ధోని. అలాగే కర్త, కర్మ , క్రియ కూడా ధోని నే….

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

GAVVA.IN