Lifestyle

శబరి లో ఆడవారి ప్రవేశం తో ఆలయం లో పెను ప్రమాదం..

అత్యంత ప్రశిష్టం పొందిన దేవాలయాల్లో శబరీ అయ్యప్ప ఆలయం  కూడా ఒకటి..అక్కడికి ఆడవారి ప్రవేశం నిషేధం అయింది..ఆడవారి ప్రవేశం కోసం పెద్ద ఎత్తున గొడవలు   అయ్యాయి..ఆడవారిని లోయంలోకి అననుమంతించడం వలన ఏమి జరగదు అని చాల మంది నచ్చచెప్పారు..కానీ ఆడవారికి అనుమంతించడం వెనుక ఎలాంటి చర్యలు రాలేదు..కానీ  అయ్యప్పస్వామి దర్శనం తొలిసారిగా ఇద్దరు  మహిలలకు  దక్కింది. ఒకరు కాదు, ఇద్దరు మహిళలు భద్రతా సిబ్బంది సాయంతో అయ్యప్పస్వామిని దర్శించుకున్నారు. 40 ఏళ్ళ వయసున్న ఇద్దరు మహిళలు ఆలయంలో ప్రవేశించడం జరిగింది . . ఇక్కడ పదేళ్ళ పైబడిన, 50 ఏళ్ళకు దిగువన వయసున్న మహిళల ప్రవేశంపై ‘సంప్రదాయ నిషేధం’ వుంది. దాన్ని ఎత్తివేస్తూ ఇటీవల సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెల్లడించింది.

 

ఆ తీర్పు పై పలు విధ్వంసాలు కూడా చెలరేగాయి.పలుమార్లు మహిళలు, శబరిమల దేవాలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించినా, భక్తులు వారిని నిలువరించగలిగారు. కానీ ఈరోజు ఉదయం అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించారు భద్రతా సిబ్బంది. మఫ్టీలో కొందరు సిబ్బంది, ఇద్దరు మహిళల్ని దేవాలయంలోకి తీసుకెళ్ళారు. ఉదయం 3.45 నిమిషాల సమయంలో ఈ ఘటన జరిగింది. ఊహించని ఈ ఘటనతో మొత్తంగా అయ్యప్ప భక్త సమాజం షాక్కి గురయ్యింది.అయితే మరోపక్క  ఆలయ ప్రధాన అర్చకుడు శబరిమల అయ్యప్ప దేవాలయాన్ని ‘సంప్రోక్షణ’ నిమిత్తం రెండురోజులు మూసివేయాలని ఆదేశించారు. తద్వారా దేవాలయం మూతపడింది. సంప్రోక్షణ అనంతరం, శబరిమల దేవాలయం భక్తుల దర్శనం కోసం తెరుచుకోనుంది.కానీ ఆ సంప్రోక్షణ మూసివేత అంశంపై కొందరు మహిళా భక్తుల నుంచి ఆందోళన చేపడుతున్నారు .వారు  సుప్రీంతీర్పున్నే ధిక్కరిస్తారా.? అంటూ ఆందోళన మొదలవుతోంది. మరోమారు ఈ విషయమై సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు మహిళా భక్తులు.కానీ ఒక అడ స్త్రీ ఆలయ లోపలి వచ్చిందంటే ఎలాంటి విధ్వంసం రాబోతుందో అని అక్కడి భక్తులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు..

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *