Lifestyle

బన్నీకి అరవింద్, చరణ్ కి చిరంజీవి, వరుణ్ కి నాగబాబు ఉన్నారు..నాకు మాత్రం ఎవరు ..?

మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన హీరో సాయి ధరమ్ తేజ్.. తాజాగా ఆయన ధరమ్ తీసేసి, సాయి తేజ్ గా పేరు మార్చుకున్నారు. వరస ప్లాప్స్ తర్వాత ఒక మోస్తరు హిట్ అనేది చిత్రలహరి ద్వారా సాధించాడు.. కెరీర్ మొదలుపెట్టిన కొద్దీ రోజ్జులోనే మెగా ఫ్యామిలీలో తనదైన ముద్ర వేసి, సత్తా వున్నా నటుడనే పేరు తెచ్చుకున్నాడు, కానీ దానిని నిలబెట్టుకోలేక కిందకి పడిపోయాడు. అయితే వెనకడుగు వేయకుండా చివరికి కస్టపడి ఒక హిట్ సాధించాడు..ఆ సినిమా యొక్క సెలెబ్రిట్ మూడ్ లో వున్న సాయి తేజ్ తాజాగా ఒక మీడియా సంస్థ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో యాంకర్ మాట్లాడుతూ మెగా ఫ్యామిలీ లో ఒక్కో హీరోకి ఒక్కో బ్యాక్ బోన్ లాంటి వాళ్ళ సపోర్ట్ వుంది, అందుకే వాళ్ళ కెరీర్ బాగుంది, అలాంటి వాళ్ళు మీకు లేరు అందుకే మీరు రేస్ లో వెనకున్నారని అడగటంతో, దానికి సాయి తేజ్ సమాధానం ఇస్తూ, చరణ్ కి చిరంజీవి గారు, వరుణ్ కి నాగబాబు గారు, బన్నీ కి అరవింద్ గారు ఉన్నారు, అది నిజం అయితే నా వెనుక ఎవరు లేరనేది మాత్రం అబద్దం, ఎందుకంటే నా వెనుక మా ముగ్గురు మామయ్య లు ఉన్నారు, వాళ్లే నాకు సపోర్ట్, అంటూ మాట్లాడటం జరిగింది.. నిజానికి సాయి తేజ్ కెరీర్ మొదటిలో చూస్తే మిగతా మెగా హీరోల కంటే దూసుకొనివెల్తాడు అని అనుకున్నారు, కానీ మధ్యలో కొన్ని రాజకీయాలు అనేవి జరిగిన మాట వాస్తవం.. దానికి తోడు సాయి తేజ్ పర్సనల్ లైఫ్ లో కూడా ఒక హీరోయిన్ తో లవ్ ట్రాక్ కూడా నడిచింది.

ఆ వ్యవహారంలో అల్లు అరవింద్ ఇన్వాల్ అవ్వటం, అది సాయి తేజ్ కి నచ్చకపోవటం దాని వలన కొంచం మెగా ఫ్యామిలీ కి దూరంగా జరగటం లాంటివి జరిగాయి.. అదే టైం లో సినిమాల విషయంలో సాయి తేజ్ జడ్జిమెంట్ రాంగ్ కావటంతో అతని కెరీర్ స్పీడ్ తగ్గిపోయింది. ఈ సమయంలో సాయి తేజ్ అమ్మ గారు చిరంజీవి దగ్గరకి వెళ్లి నా కొడుకుని ఎవరు పట్టించుకోరా.. వాడిని అలాగే వదిలేస్తారా..? అంటూ బాధపడటంతో చిరంజీవి ఎంటర్ అయ్యి, మళ్ళీ అల్లు అరవింద్ ని పురమహించటం, అలాగే ఈ చిత్రలహరి కథని కూడా స్వయంగా చిరంజీవి వినటం లాంటివి జరిగాయి, దాని ఫలితమే ఈ సినిమా ఒక మోస్తరు విజయం సాధించింది.. ఇక్కడ గమనిస్తే గతంలో సాయి తేజ్ చేసిన ఆరు సినిమాల్లో ఒకటి కూడా మొదటి నుండి ప్రేక్షుకుల అటెంక్షన్ రాబట్టుకోలేకపోయింది, కానీ ఈ సినిమా మొదటి పోస్టర్ దగ్గర నుండే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంటూ ముందుకి వెళ్ళింది.. ఇక్కడ అసలైన మార్కెట్ స్ట్రాటజీ కనిపిస్తుంది…మనం ఎన్ని చెప్పుకున్న కానీ ఫ్యామిలీ సపోర్ట్ అనేది కొందరి హీరోలకి సంజీవని లాంటిదే.. అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు..

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *