Lifestyle

పవన్ ఫ్యాన్స్ ని గెలికిన రేణు దేశాయ్ ..నాది దొంగపెళ్లి కాదు

రేణు దేశాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండో భార్యగా అందరికి తెలుసు. ఆమె పవన్ నుండి వేరుపడిన కానీ అభిమానులు వదినమ్మ వదినమ్మ అంటూ ఆప్యాయంగా పిలిచేవారు.. ఆ అభిమానం ఎంత వరకు వెళ్లిందంటే చివరికి వదినమ్మ నువ్వు పెళ్లి లాంటివి ఏమి చేసుకోవద్దు, లైఫ్ లాంగ్ ఇలాగె వుండు నిన్ను మా వదినమ్మ గా చూసుకుంటాం అనేవారు. అయితే వీళ్ళు సోషల్ మీడియాలో చెప్పే మాటలతో ఆమె కడుపు అయితే నిండదు, ఆమెకి తోడు అనేది దొరకదు కదా, దీనితో ఆమె తనకి సరిపోయిన ఒకరిని చూసుకొని వాళ్లతో ఎంగేజ్మెంట్ చేసుకుంది, దాని తాలూకా ఫొటోస్ సోషల్ మీడియాలో పెట్టింది, దీనితో ఆమెమీద భారీస్థాయిలో ట్రోలింగ్ నడిచింది, పవన్ కళ్యాణ్ సోకాల్డ్ ఫాన్స్ చివరికి ఆమె ఒక ఆడది అనే విషయం మర్చిపోయి దారుణంగా కామెంట్స్ చేశారు.. దానికి ఆమె గట్టిగానే సమాధానం ఇచ్చింది.

తాజాగా ఒక షో కి వచ్చిన ఆమె తన రెండో పెళ్లి గురించి మరోసారి చెప్పింది.. నాకు ఇది వరకే ఎంగేజ్మెంట్ అయ్యింది. అది జరిగి చాల రోజులు అవుతున్న కానీ ఇంకా ట్రోలింగ్ అనేది జరుగుతూనే ఉంది.. అయినా నాకేమి భయం లేదు.. నేను ఏమి దొంగపెళ్లి చేసుకోవటం లేదు, అందరికి చెప్పే మా కుటుంబంలో వాళ్ళ సమక్షంలోనే చేసుకుంటున్న, కాకపోతే ఎంగేజ్మెంట్ అయ్యి చాల రోజులు అవుతుంది ఇంకా పెళ్లి ఎందుకు చేసుకోలేదని అడుగుతున్నారు, పెళ్లి అంటే మాటలు కాదుకదా,,దానికి కొంత ప్రాసెస్ అనేది ఉంటుంది. దాని ప్రకారమే ముందుకి వెళుతున్న, నాకు కాబోయే భర్త సాఫ్ట్ వెర్ కంపెనీ లో డైరెక్టర్ స్థాయి కలిగిన వాడు. గతంలో అమెరికాలో చేసేవాడు, తన తండ్రికి ఆరోగ్యం బాగాలేకపోవటంతో ఇండియా వచ్చి ఇక్కడే సెటిల్ అయ్యాడు.. మరి కొద్దీ రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్న అంటూ చెప్పింది. అయితే ఇన్ని చెప్పిన రేణు దేశాయ్ అతని పేరు మాత్రం చెప్పకపోవటం విశేషం ..

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *