Lifestyle

తన తండ్రి మరణ వార్త విని ఒక్కసారిగా కుప్పకూలిన రాజీవ్ కనకాల…విషాదంలో సినీ ఇండస్ట్రీ

ప్రముఖ నటుడు,దర్శకుడు ,నిర్మాత అయినటువంటి దేవదాస్ కనకాల ఇటీవలే కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారని అప్పట్లో కొన్ని వార్తలు కూడా వచ్చాయి. అయితే ఉన్నట్టుండి హఠాత్ గా ఆయన మరణం ఒక్కసారిగా అందరిని ఆశ్యర్యాన్ని కలిగించింది.అసలు వివరాల్లోకి వెళ్తే…దేవదాస్ కనకాల వయస్సు ప్రస్తుతం 74 సంవత్సరాలు 1974లో ఓ సీత కథ సినిమా ద్వారా నటుడిగా కెరీర్ మొదలు పెట్టిన ఆయన దాదాపు 30 సినిమాల్లో నటించారు. కొన్ని చిత్రాలకు దర్శకత్వం వహించారు. 1945లో జూలై 30 న యానం సమీపంలోని కనకాలపేటలో జన్మించిన దేవదాస్ కనకాల విశాఖలోని ఎ.వి.యన్ కాలేజీలో డిగ్రీ, ఆంధ్ర విశ్వవిద్యాలయం‌లో థియేటర్ ఆర్ట్స్ పూర్తి చేశారు.

సాంగ్ అండ్ డ్రామా కేంద్ర ప్రభుత్వ పబ్లిసిటీ డివిజన్‌లో నటుడిగా ఉద్యోగ జీవితాన్ని ఆరంభించి కొన్ని రోజులకే దాన్ని వదిలేశారు. ఉద్యోగానికి రాజీనామా చేసిన ఆయన సినిమా రంగంలోకి అడుగు పెట్టారు. నటుడిగా, దర్శకుడిగా రాణించారు. అడయార్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ (మద్రాస్) లో ఎ.ఆర్.కృష్ణ సారథ్యంలో నడిచిన ఆంధ్రప్రదేశ్ రిపర్టరీలోను, మధు ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లోను అధ్యాపకునిగా మరియు తెలుగు విశ్వవిద్యాలయం రంగస్థల కళలశాఖలో అధ్యాపకునిగా, శాఖాధిపతిగా పనిచేశారు. నటీనటులకు శిక్షణ ఇస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రజనీకాంత్‌, చిరంజీవి, రాజేంద్ర ప్రసాద్‌, శుభలేఖ సుధాకర్, నాజర్‌, ప్రదీప్ శక్తి, భానుచందర్‌, అరుణ్‌పాండ్యన్‌, రాంకీ, రఘువరన్ వంటి ప్రముఖులు సైతం ఆయన వద్ద శిక్షణ తీసుకున్నారు.

దేవదాస్ కనకాల 1971లో లక్ష్మీదేవిని ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆమె కూడా సినిమా రంగానికి చెందిన వ్యక్తే . వీరికి కుమారుడు రాజీవ్ కనకాల, ఒక కుమార్తె శ్రీలక్ష్మీ ఉన్నారు. రాజీవ్ కనకాల నటుడిగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. రాజీవ్ యాంకర్ సుమను పెళ్లాడారు. ఇప్పటికి కూడా వీరి పేరు బాగా పాపులర్ అవుతూ వస్తూనే వుంది. యాంకర్ సుమ గారిని వల్ల కన్నా తల్లిదండ్రుల కంటే ఎక్కువగా చూసుకున్నారు మా మామ గారు అని గతంలో పలు ఇంటర్వూస్ లో కూడా చెప్పారు.అంతటి మహానుభావుడికి కోడలు అయినందుకు చాలా సంతోషిస్తున్నానని యాంకర్ సుమా తన సంతోషాన్ని ప్రేక్షకులకు పంచుకున్నారు.కానీ ఇప్పుడు ఆయన మరణం తెలుగు సినీ పరిశ్రమలో ప్రతీ ఒక్కరిని విషాదంలోకి ముంచిందని చెప్పాలి ఏదేమైనా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనం కూడా ఆశిద్దాం.

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *