Lifestyle

కౌశల్ హాస్పిటల్ వీడియోపై దుమారం..

బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ కౌశల్ గురించి మీడియాలో జరిగిన రచ్చ అంత ఇంత కాదు.. టైటిల్ గెలిచినా దగ్గర నుండి మొన్న కౌశల్ ఆర్మీ లోకి కొందరు సభ్యులు బయటకు వచ్చి కౌశల్ మీద ఆరోపణలు చేయటం వరకు ప్రతిదీ కూడా సోషల్ మీడియాలో టాప్ ట్రేడింగ్ లో నడిచిన విషయమే అని చెప్పాలి.. తాజాగా మరో విషయంలో కౌశల్ టాపిక్ హాట్ హాట్ గా నడుస్తుంది. కౌశల్ సతీమణి నీలిమకి హైదరాబాద్ లోని కాంటినెంటల్ హాస్పెటల్ లో ఒక మేజర్ సర్జరీ జరిగిందని ఆమె ఆరోగ్యం బాగుండాలని సోషల్ మీడియాలో పోస్ట్ లు కనిపిస్తున్నాయి. అయితే కౌశల్ అంటే కిట్టని వాళ్ళు అది కూడా ఒక పబ్లిసిటీ స్టాంట్ అని అందులో నిజం లేదని చెపుతూ పోస్ట్ చేస్తున్నారు. దీనితో వాటికీ చెక్ పెట్టటానికి కౌశల్ హాస్పెటల్ లో బెడ్ మీద వున్నా తన భార్య నీలిమ ని చూపిస్తూ ఒక వీడియో తీసాడు. ఆమెకి సర్జరీ జరిగిందని, ప్రస్తుతం రెస్ట్ తీసుకుందని చెపుతూ ఆ వీడియో పోస్ట్ చేసాడు. ఇక ఆ వీడియో చుసిన కౌశల్ అభిమానులు ఏమో బాధపడకు అన్నయ వదినమ్మ త్వలోనే కోలుకుంటుంది, ‘గెట్ వెల్ సూన్’ అంటూ కామెంట్ చేశారు.. అలాగే నీకు వదినమ్మకి మేము తోడుగా వున్నాం అంటూ పోస్ట్ చేస్తున్నారు, అదే సమయంలో కౌశల్ అంటే కిట్టని వాళ్ళు మాత్రం ఇది ఒక పబ్లిసిటీ లో భాగమే, అందుకే చివరికి బెడ్ మీద వున్నా ఆమెని కూడా వదిలిపెట్టకుండా వాడుతున్నాడు అంటూ నెగిటివ్ కామెంట్స్ పెట్టటం జరుగుతుంది. పాపం కౌశల్ ని చుస్తే జాలి కలగకమానదు, అతను నిజాయితీగా ఏ పని చేసిన కానీ అందులో పబ్లిసిటీ స్టాంట్ కనిపిస్తుందని అంటుండే అతను మాత్రం ఏమి చేస్తాడు. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ప్రజల్లో అతను పబ్లిసిటీ కోసమే చేస్తున్నాడు అనే ఫీలింగ్ రావటానికి కూడా అతనే ప్రధాన కారణం. అతను చేసిన కొన్ని పనులు వలన చాల మందిలో అలాంటి భావనే బలంగా నాటుకొనిపోయింది..

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *