Lifestyle

భారత బ్యాడ్మింటన్‌ బాహుబలి

ఒకే ఏడాది వరసగా 7 ఫైనల్స్ లో ఓటమి, ఎక్కడికి వెళ్లిన రెండో స్థానమే తన కోసం ఎదురుచూస్తూ వుంది.. ఆమెకి ఫైనల్ ఫోబియా పట్టుకుంది, అంటూ ఎన్నో విమర్శలు, గెలుపు ముంగిటకే వచ్చి చివరి నిమిషంలో విజయం చేజారితే కలిగే బాధ వర్ణనదితీతం..ఆలా ఒకటి కాదు 7 సార్లు ఒకే ఏడాదిలో ఆ బాధలను భరించింది.. అయితే వాటన్నిటికీ ఒకే ఒక విజయంతో చెక్ పెట్టేసింది మన తెలుగుతేజం పూసర్ల వెంకట సింధు బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ టూర్‌ ఫైనల్స్‌ టైటిల్‌ సాధించిన మొదటి భారతీయ క్రీడాకారిణిగా సరి కొత్త చరిత్రకి శ్రీకారం చుట్టింది..బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ టూర్‌ ఫైనల్స్‌ భారత దేశ క్రీడాకారులకు అందని ద్రాక్ష అనే చెప్పాలి.. భారత్ లో బ్యాడ్మింటన్‌ క్రీడకి ఆదరణ పెంచిన ఘనత కచ్చితంగా సైనా నెహ్వాల్ కి దక్కుతుంది,,ఒలింపిక్స్‌, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌, కామన్వెల్త్‌ క్రీడల్లో పతకాలు ఆమె సొంతం. అలాంటి సైనా సైతం ఛేదించలేని లక్ష్యం.. బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ టూర్‌ ఫైనల్స్‌. ఇప్పటికి ఏడు సార్లు దండెత్తిన సైనా.. ఒక్కసారి కూడా టైటిల్‌ గెలవలేకపోయింది. 2011లో ఫైనల్లో అడుగుపెట్టడమే సైనా అత్యుత్తమ ప్రదర్శన.. కొందరికి సరిగ్గా తెలియకపోవచ్చు బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ టూర్‌ సిరీస్ అంటే ఏమిటో,, వాళ్ళకి ఒక చిన్న వివరణ..ఏడాది మొత్తం జరిగే సూపర్ సిరీస్ అన్నిటిలో కలిసి అద్భుత ప్రదర్శన చేసిన మొదటి ఎనిమిది మంది క్రీడాకారులను ఎంపిక చేసి ఈ ప్రపంచ టోర్నీకి నిర్వహిస్తారు.. సూపర్ సిరీస్ లో సెమి ఫైనల్ నుండి గట్టి పోటీ అనేది ఉంటుంది. చావో రేవో తెలిసిన మ్యాచ్ లు ఉంటాయి, కానీ బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ టూర్స్ లో మాత్రం మొదటి మ్యాచ్ కూడా ఒక ఫైనల్ మ్యాచ్ లాగే ఆడాలి. ఒక సూపర్ సిరీస్ అంటేనే చాలా గొప్ప విషయం అలాంటిది, వాటికీ మించింది దానికి ఎన్నో రేట్లు పెద్దదైనంది ఈ బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ టూర్‌ సిరీస్..అందుకే ప్రతి క్రీడాకారుడు, క్రీడాకారిణి ఈ టైటిల్ ను తమ క్రీడ జీవిత కాలంలో ఒక్కసారైనా ముద్దాడాలని కోరుకుంటారు.. ఇక మన సింధు ఉన్న గ్రూప్‌-ఎను ‘గ్రూఫ్‌ ఆఫ్‌ డెత్‌’గా వర్ణించారు బ్యాడ్మింటన్‌ విశ్లేషకులు. సింధుతో పాటు ప్రపంచ నంబర్‌వన్‌ తై జు యింగ్‌ (చైనీస్‌ తైపీ), రెండో ర్యాంకర్‌ అకానె యమగూచి (జపాన్‌), 12వ ర్యాంకర్‌ బీవెన్‌ జాంగ్‌ (అమెరికా) గ్రూప్‌-ఎలో ఉన్నారు. ఇద్దరు క్రీడాకారిణులకు మాత్రమే సెమీస్‌కు వెళ్లే అవకాశం ఉండటంతో తై జు, యమగూచి, సింధుల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఈ ఏడాది ఒక్క టైటిల్‌ నెగ్గని సింధు సెమీస్‌ చేరడం కష్టమే అనుకున్నారంతా. ఐతే అంచనాల్ని తలకిందులు చేస్తూ సింధు అద్భుత విజయాలతో సాగింది. తొలుత యమగూచి.. తర్వాత యింగ్‌ను చిత్తుచేసి ఒక్కసారిగా ఫేవరెట్‌గా అవతరించింది. ప్రపంచ నం.1, నం.2లను ఓడించిన సింధు ఆత్మవిశ్వాసం రెట్టింపయింంది.

 

నాకౌట్‌లో మాజీ ప్రపంచ ఛాంపియన్లు ఇంతానన్‌ రచనోక్‌ (థాయ్‌లాండ్‌), నొజొమి ఒకుహర (జపాన్‌).. సింధు ముందు తేలిపోయారు. ఏ టోర్నీలోనైనా ఒకరో, ఇద్దరో అగ్రశ్రేణి క్రీడాకారులు ఎదురువుతారు. తై జు యింగ్‌, యమగూచి, ఒకుహర, రచనోక్‌ వంటి అగ్ర క్రీడాకారిణులందరినీ ఒకే టోర్నీలో ఓడించడం సింధుకే చెల్లింది.. ‘బ్యాడ్మింటన్‌లో ఒక భారత క్రీడకారిణి ఏ స్థాయికి చేరుకోగలదో సైనా చూపించింది. మన స్థాయి ఇది అనుకునేలోపే సింధు ఇంకో మెట్టు పైకి తీసుకెళ్లింది’’- ఇటీవల జాతీయ బ్యాడ్మింటన్‌ చీఫ్‌ కోచ్‌ గోపీచంద్‌ సింధు గురించి చెప్పిన మాటలు,అయితే ప్రతిభ, నైపుణ్యంలో తిరుగులేని సింధును నిరుడు సెప్టెంబరు నుంచి టైటిళ్లు వెక్కిరిస్తున్నాయి. కొరియా ఓపెన్‌ తర్వాత ఏడు టోర్నీల్లో ఫైనల్స్‌ ఆడిన సింధుకు నిరాశే ఎదురైంది. ‘ఫైనల్‌ ఫోబియా’ అపప్రదతో ఇబ్బందులు ఎదుర్కొన్న సింధుకు ‘సిల్వర్‌ స్టార్‌’ అన్న పేరూ వచ్చింది. విమర్శలు.. వ్యాఖ్యానాలతో ఏమాత్రం కుంగిపోకుండా మరింత పట్టుదల ప్రదర్శించింది సింధు. ఫైనల్లో ఒకుహర సుదీర్ఘ ర్యాలీలతో విసుగెత్తించినా..

 

పదేపదే కోర్టుకు దూరంగా షటిల్‌ను పంపుతూ ఇబ్బందిపెట్టినా ఎంతో సహనంతో ఎదుర్కొని విజయం సాధించింది. ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్లు.. బీడబ్ల్యూఎఫ్‌ ఫైనల్స్‌తో టైటిళ్ల కరువు తీర్చుకున్న సింధు.. అగ్రశ్రేణి క్రీడాకారిణులను మట్టికరిపించి ఛాంపియన్లకే ఛాంపియన్‌గా అవతరించింది.. నయా బాహుబలిగా అవతరించింది సింధు..ఇక్కడ ఇంకో చిన్న విషయం చెప్పాలి. ఇండియా అంటే ఒక్క క్రికెట్ మాత్రమే కాదు.. ఎన్నో ఆటలకు నిలయం, కానీ క్రికెట్ కి వున్నా ఆదరణ అనేది మరో క్రీడకి లేకపోవటం మన దురదృష్టం..అయితే ఇప్పుడు మెల్ల మెల్లగా మిగతా వాటికీ ఆదరణ పెరుగుతూ వుంది.. వర్ధమాన క్రీడాకారులు ఒక్క క్రికెట్ ని మాత్రమే కాకుండా టెన్నిస్ బ్యాట్మింటన్ లాంటి క్రీడల వైపు ద్రుష్టి సారిస్తున్నారు.. కాబ్బటి ప్రభుత్వం వాటి పరంగా అలోచించి మెరుగైన వసతులు కల్పిస్తే ఒలంపిస్ లాంటి మెగా ఈవెంట్స్ లో మనకి రెండెంకల సువర్ణ పతకాలు వస్తాయి.. దయచేసి క్రీడలను ఆదాయవనరులుగా మాత్రమే చూడకుండా,, దేశ ప్రతిష్టని ప్రపంచంలో సగర్వముగా నిలిపే ఒక మార్గం గా ఆలోచించండి

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *