Lifestyle

మా నాన్నతో నాకు విభేదాలు ఏమిలేవు…

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన కొత్త సినిమా ని స్టార్ట్ చేసి యమా స్పీడ్ గా షూటింగ్ చేస్తున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని దసరా కి తీసుకోని రావాలని చూస్తున్నాడు. అయితే గత కొద్దీ రోజులుగా ఫిలిం నగర్ సర్కిల్ లో బన్నీ గురించి ఒక న్యూస్ బాగా హల చల్ చేస్తుంది. అదేమిటంటే వాళ్ళ నాన్న అల్లు అరవింద్ కి బన్నీకి గొడవలు అయ్యాయని, ఇద్దరి మధ్య మాటలు లేవని, అందుకే నా పేరు సూర్య సినిమా తర్వాత మరో సినిమా చేయటానికి ఇంత టైం పెట్టిందనే మాటలు బాగా వినిపిస్తున్నాయి. అయితే ఇవి మీడియాలో కంటే కూడా ఆఫ్ లైన్ లోనే బాగా వినిపించాయి. తాజాగా ఒక ఫంక్షన్ లో బన్నీ మాట్లాడుతూ నాకు మా నాన్నకి మధ్య మాటలు లేవని,పెద్ద పెద్ద గొడవలు అయ్యాయనే విషయం ఈ మద్యే నాకు తెలిసింది.

ఆ విషయం తెలియగానే నేను నవ్వుకున్నా, అయినా మా నాన్నకి నాకు గొడవలు ఎందుకు వస్తాయి చెప్పండి.. నిజానికి నేను మా ఫ్యామిలీ ఎక్కవులాగా క్లోజ్ గా ఉండేది మా నాన్నతో అలాంటిది ఆయనకి నాకు గొడవలు అనే విషయం తెలిసేసరికి అసలు ఇలాంటి గాసిప్స్ ఎలా పుటిస్తారో నాకు అర్ధం కాలేదు..అయన నాకు నాన్న మాత్రమే కాదు,, ఒక బెస్ట్ ఫ్రెండ్ అలాంటిది ఆయనతో నాకేమి గొడవలు ఉంటాయి చెప్పండి.. అంటూ పుకారుకి పులుస్టాప్ పెట్టేశాడు.. ప్రస్తుతం బన్నీ చేస్తున్న సినిమా కూడా ఎక్కువగా ఫాదర్ సెంటిమెంట్ తో ఉంటుందని తెలుస్తుంది. గతంలో సన్నాఫ్ సత్యమూర్తి సినిమా చేశాడు. అందులో కూడా ఫాదర్ సెంటిమెంట్ వుంది, కాకపోతే ఈ సినిమాలో ఇంకొంచం ఎక్కువ మోతాదులోనే ఉంటుందని సమాచారం . ఈ సినిమా కాకుండా బన్నీ మరో రెండు కొత్త సినిమాలకి సైన్ చేసిన విషయం తెలిసిందే,, ఐకాన్ అంటూ ఒక డిఫ్ఫరెంట్ స్టోరీ తో సినిమా చేయబోతున్నాడు.. ఇలాంటి బిజీ టైం లో కూడా తమ మీద వచ్చిన పుకారుకి స్పందించి అనుమానాలకు చెక్ పెట్టాడు

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *