Lifestyle

దేవి శ్రీ ప్రసాద్ కి మొదటి అవకాశం ఎలా వచ్చిందో తెలుసా… 17 ఏళ్ల వయస్సులో 40 మందితో..

తెలుగులో ఒక స్టార్ హీరో సినిమా సెట్స్ మీదకి వెళ్తుదంటే దానికి మ్యూజిక్ డైరెక్టర్ గా ఎవరిని తీసుకోవాలంటే మొదటిగా గుర్తువచ్చేది దేవి శ్రీ ప్రసాద్.. అయన ఏమైనా బిజీ అయితే తప్ప అగ్ర హీరోల సినిమా ఛాన్స్ లు వేరే వాళ్ళకి వెళ్ళేవి కాదు.. ఒక సాధారణ సినిమాని కూడా తన మ్యూజిక్ తో మరో స్థాయికి తీసుకొనివెళ్లే సత్తా అతని సొంతం. అందుకే అతని కోసం గతంలో సినిమాలను కూడా హోల్డ్ లో పెట్టిన నిర్మాతలు వున్నారు. అలాంటి సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ కి మొదటి ఛాన్స్ ఎలా వచ్చింది. ఏ వయస్సులో అతను మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడనే విషయాలు తెలిస్తే నిజంగా షాక్ అవుతారు..

దేవి శ్రీ ప్రసాద్ వాళ్ళ నాన్న గారు సత్య మూర్తి ప్రముఖ తెలుగు స్టోరీ రైటర్ అతని ఇంటికి దర్శక నిర్మాతలు ఎప్పుడు వస్తుంటారు.. ఒకసారి MS రాజు దేవి శ్రీ ప్రసాద్ వాళ్ళ ఇంటికి వచ్చాడు. వాళ్ళ సిట్టింగ్ రూమ్ పక్కనే దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ రూమ్ ఉండేది. నిజానికి దేవి ఇంటర్ క్లాస్ కి వెళ్లి ఇంటికి వచ్చి ఇక ఎక్కువ సమయంలో తన మ్యూజిక్ రూమ్ లోనే గడిపేవాడు.. తనకి నచ్చింది ప్లే చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉండేవాడు. అలాగే సొంతగా ఒక మ్యూజిక్ ఆల్బమ్ చేశాడు. MS రాజు వచ్చినప్పుడు దేవి శ్రీ ప్రసాద్ ఎదో ప్లే చేస్తూ వున్నాడు. అది విని రూమ్ లోకి వచ్చిన అయన ఏ అబ్బాయి ఎదో చేస్తున్నావు, నా కోసం నువ్వు చేసిన ఏమైనా ట్యూన్ ఉంటే వినిపించు అని అడిగాడు. దీనితో గతంలో దేవి శ్రీ చేసిన ఆల్బమ్ లోని ఒక సాంగ్ వినిపించాడు. అది విని ఇంప్రెస్ అయినా MS రాజు ఒక సన్నివేశం చెప్పి దానికి ట్యూన్ చేయమన్నాడు. వెంటనే దానికి ట్యూన్ చేసి ఇచ్చాడు దేవి శ్రీ, అది MS రాజు కి విపరీతంగా నచ్చటంతో నా సినిమాకి నువ్వే మ్యూజిక్ డైరెక్టర్ అంటూ అక్కడిక్కడే మాట ఇచ్చాడు.

అప్పుడు దేవి శ్రీ ప్రసాద్ వయస్సు 17 ఏళ్ళు. అది కలో నిజమో కూడా దేవి శ్రీ కి అర్ధం కాలేదు. ఇక సినిమా స్టార్ట్ అయ్యింది. మొదటి పాట రికార్డింగ్ జరుగుతుంది. కంపోజ్ చేయటానికి దాదాపు 40 మందిని స్టూడియో కి తీసుకొనివచ్చారు. అందరూ లోపల వున్నారు. బయట ఏమో దేవి శ్రీ ప్రసాద్ వాళ్ళ నాన్న ఆందోళనతో తిరుగుతూ వున్నాడు. అందరిని పిలిపించాడు వీడు ఏమి చేస్తాడో అనే భయంతో అయన వున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ మాత్రం తనకి వచ్చింది చేస్తూ సక్సెస్ ఫుల్ గా మొదటి పాటని కంపోజ్ చేశాడు. అది మొత్తం అయినా తర్వాత ధియోటర్ మొత్తం చప్పట్లతో మార్మోగిపోయింది.. ఆ సినిమానే దేవి. నిజానికి దానికి పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ పనిచేయాలి, కానీ దేవి శ్రీ కి ఆ ఛాన్స్ వచ్చింది. దానిని నిలబెట్టుకొని అద్భుతమైన ఆల్బమ్ ఇచ్చాడు. ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే ఆ సినిమా తర్వాతే అతనికి దేవి శ్రీ ప్రసాద్ అనే పేరు వచ్చిందని కొందరు చెపుతారు, కానీ మొదటి నుండే అతని పేరు దేవి శ్రీ ప్రసాద్.. ఈ సినిమాకి గుమ్మడి కాయ కొట్టిన తర్వాతే సినిమాకి దేవి అని పేరు పెట్టారు.. పైన చెప్పిన విషయాలు అన్ని ఒక సందర్భంలో దేవిశ్రీ ప్రసాద్ చెప్పిన మాటలు

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

GAVVA.IN