MOVIE

టాలీవుడ్ లో మరో సంచలనం జరగబోతోందా..?

తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా తెర మీదకి రావడానికి ఒక వారం రోజులు మాత్రమే ఉంది..దానికి సమానంగా మహేష్ బాబు ఏఎంబీ సినిమాస్ లాంచింగ్ అనేది బారి ఎత్తున జరగబోతుంది..దాని ఓపెనింగ్ కి ముఖ్య అతిదిగా రజినీకాంత్ ని ఆహ్వానించడం జరిగింది..కానీ రజినికాంత్ వస్తారా లేదా అన్నది ఇంకా అధికారకంగా స్పష్టం కాలేదు…రజినీకాంత్ 2 .0 కి ఎంత క్రేజ్ ఉందో సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాస్ లాంచింగ్ మీద కూడా అదేవిదంగా ఉంది..ఈపాటికే లాంచ్ కావాల్సిన మహేష్ – ఏషియన్ సినిమాస్ మల్టీప్లెక్స్ ఓ దివ్యమైన ముహూర్తం కోసమే వేచి చూస్తోంది. ఆ ముహూర్తాన్ని ఇప్పటికే లాక్ చేశారని ఇదివరకూ చెప్పుకున్నాం. రజనీ నటించిన 2.ఓ షోతోనే లాంచ్ చేయాలని ఏఎంబీ సినిమాస్ అధినేతలు భావించారట. అయితే రజనీ వస్తారా లేదా? అన్నదానికి అధికారికంగా ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు.

 

ఇంతకీ ఏఎంబీ సినిమాస్ ప్రత్యేకత ఏంటి? అంటే.. ఈ మల్టీప్లెక్స్ హైదరాబాద్ నగరానికే కొత్త కళ తేనుందిట. నగరంలోనే అత్యంత కాస్ట్లీగా రిచ్ లుక్తో కనీవినీ ఎరుగని రీతిలో ఇంద్రభవనాన్ని తలపించే హైఫై ఆర్కిటెక్చర్ లుక్తో దీనిని నిర్మించారు. అది కూడా హైదరాబాద్ గుండెకాయ గచ్చిబౌళి పరిసరాల్లో ఉండడంతో జనాల కన్ను దీనిపై ఉందిప్పుడు. ఇందులో ఏకంగా 7 స్క్రీన్లు ఉన్నాయి. ఇవన్నీ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ స్క్రీన్ మోడల్లో ఉంటాయిట. ఇందులో 3డి టెక్నాలజీ ఇన్బిల్టెడ్. 7 స్క్రీన్లలో మొత్తం 1636 సీట్లు ఉంటాయిట. స్క్రీన్ 1లో 436 సీట్ల కెపాసిటీ లేజర్ ప్రొజెక్షన్ సిస్టమ్ హైలైట్గా ఉంటాయిట. స్క్రీన్ 2లో 308 సీట్లు స్క్రీన్ 3లో 308 సీట్లు స్క్రీన్ 4లో 158 సీట్లు (ఇది చిన్న సైజు) అలాగే స్క్రీన్ 6లో 214 సీట్లు ఉంటాయిట. స్క్రీన్ 5 వీటన్నిటి కంటే డిఫరెంట్. ఇందులో ప్రత్యేకించి 52 వీఐపీ సీట్లు స్పెషల్గా డిజైన్ చేశారట.

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *