MOVIE

విజయ్ దేవరకొండ మారకపోతే కష్టమే …

విజయ్ దేవరకొండ గురించి చెప్పాలంటే ముందుగా ఓవర్ నైట్ స్టార్ అని చెపుతారు, కానీ ఓవర్ నైట్ స్టార్ కావటం వెనుక ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపాడు విజయ్.. విజయం సాధించిన తర్వాత జరిగే వాటిని గురించే అందరూ చూస్తారు, కానీ ఆ విజయానికి అతను పడిన కష్టాన్ని ఎవరు గమనించారు. ఆలా ఎన్నో కష్టాలు పడిన తర్వాత తన నటనకి తోడు అదృష్టం కలిసి వచ్చి టాలీవుడ్ లో స్టార్ హీరో రేంజు కి చేరుకున్నాడు విజయ్ దేవరకొండ. అయితే ఆ స్టార్ ఇమేజ్ కాపాడుకోవటం అనేది అంత ఈజీ కాదనే చెప్పాలి. అతని నడవడికపై, అతని సినిమాలపై ఎంతో మంది గురిపెట్టి వున్నారు. ఏ ఒక్క చిన్న అవకాశం వచ్చిన తొక్కటానికి సిద్ధంగా వున్నారు. మొన్నటి మొన్న గీత గోవిందం తర్వాత నోటా వచ్చి ప్లాఫ్ అయినప్పుడు స్వయంగా విజయ్ బయటకు వచ్చి నా శత్రువులు ఇప్పుడు పండగ చేసుకోండి. తర్వాత వాళ్ళకి ఆ అవకాశం ఇవ్వను అంటూ చెప్పటం జరిగింది. దానిని బట్టి చుస్తే ఇండస్ట్రీలో విజయ్ కి శత్రువులు ఏ స్థాయిలో వున్నారో అర్ధం చేసుకోవచ్చు. .
కేవలం మూడేళ్ళలో ఇండస్ట్రీలో మంచి ఓపెనర్ స్థాయికి వెళ్ళాడు. అర్జున్ రెడ్డి దగ్గర నుండి టాక్సీవాలా దాక అతని సినిమాలు మొదటిరోజు మంచి కలెక్షన్స్ వసూళ్లు చేస్తున్నాయి. దానికి కారణం విజయ్ అనే బ్రాండ్, యూత్ లో అతని క్రేజ్. అయితే ఇప్పుడు మెల్లగా దానిపై కొన్ని కామెంట్స్ అనేవి వస్తున్నాయి. అర్జున్ రెడ్డి తర్వాత ప్రతి సినిమాలో కూడా ఒకే రకమైన బాడీ లాంగ్వేజ్ తో చేస్తూ వెళ్తున్నాడు. ఎలాంటి మేకోవర్ అనేది లేకుండా మన పక్కింటి కుర్రాడి మాదిరిగా కనిపిస్తున్నాడు. దాని వలన మున్ముందు సమస్యలు వచ్చే అవకాశం లేకపోలేదు. గతంలో నేచురల్ స్టార్ నాని వరస సినిమాలో ఒకే రకమైన మేకోవర్ లో కనిపిస్తూ అదే రకమైం నటనతో కొన్ని సినిమాలు చేసాడు విజయం సాధించాడు. కానీ ఆ తర్వాత కృష్ణార్జున యుద్ధం దేవదాస్ లాంటి సినిమాలు ప్లాఫ్ ఇవ్వటంతో కొంచం రూట్ మార్చి జెర్సీ సినిమా కోసం పూర్తిగా మేకోవర్ చేంజ్ చేసుకున్నాడు. విజయ్ కూడా ప్రస్తుతం ఒకే రకమైన పాత్రలకు కొంచం స్వస్తి చెప్పేసి. కమర్సియల్ విలువలకి దూరంగా జరగకుండా  తనలోని అసలైన నటుడికి సవాళ్లు చేసే పాత్రలు ఎంచుకొని సినిమాలు చేస్తే స్టార్ డం ని అలాగే నిలబెట్టుకునే అవకాశం వుంది. లేకపోతే ఒక్కప్పటి స్టార్ హీరో విజయ్ దేవరకొండ అని చెప్పుకోవాల్సి రావచ్చు..

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

GAVVA.IN