MOVIE

అఖిల్ కి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన సమంత .. దాని రేటు తెలుసా..?

అక్కినేని ఫ్యామిలీలో మూడో తరం నటుడు అఖిల్. ఇప్పటికి రెండు సినిమాలు చేసిన సరైన విజయం దక్కలేదు.. ఇక మూడో ప్రయత్నంలో భాగంగా తొలిప్రేమ దర్శకుడు వెంకీ అట్లూరితో చేసిన మిస్టర్ మజ్ను సినిమాతో తోలి విజయాన్ని రుచి చూశాడు.. ఈ సినిమా హిట్ కావటంతో అక్కినేని ఫ్యామిలీలో ఎక్కడ లేని సంతోషం కనిపిస్తుంది. దాదాపు మూడేళ్ళ నుండి ఇలాంటి విజయం కోసం చూస్తున్నారు. ఆ రోజు ఈ రోజు వచ్చింది. దీనితో ఫుల్ ఖుషీలో వున్నారు. ఈ విజయాన్ని ఎవరికీ నచ్చిన రీతిలో వాళ్ళు సెలెబ్రిటీ చేసుకుంటున్నారు.

 

samantha akil

ఇక అఖిల్ వదిన నాగ చైతన్య భార్య హీరోయిన్ సమంత కూడా మజ్ను హిట్ కావటంతో ఫుల్ ఎంజాయ్ మోడ్ లో ఉంది.. మొదటి రోజు మొదటి షో ని ఫామిలీ తో కలిసి చుసిన సమంత సినిమా తర్వాత అఖిల్ కి స్పెషల్ గా విష్ చేయటమే కాకుండా అప్పటికపుడు అఖిల్ కి ఎంతో ఇష్టమైన వాచ్ ని కొని గిఫ్ట్ గా ఇచ్చింది. నిజానికి అఖిల్ కి వాచ్ లు అంటే విపరీతమైన ఇష్టం. నాగ చైతన్యకి కారులు అంటే ఎంత పిచ్చో అఖిల్ కి వాచ్ లు అంటే అంత అభిమానం. దీనితో సమంత ఇచ్చిన వాచ్ గిఫ్ట్ ని చాల సంతోషంగా తీసుకున్నాడు. ఇప్పటికే అఖిల్ దగ్గర ఇంపోర్ట్ వాచ్ లు పదులు సంఖ్యలో వున్నాయి. ఫారిన్ ఎప్పుడు వెళ్లిన కానీ ఎదో ఒక వాచ్ కొనకుండా ఇండియా రాడని అతని సన్నిహితులు చెపుతారు. ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే ఎన్టీఆర్ కి కూడా వాచ్ అంటే చాల ఇష్టం. వాచ్ ల మీద అఖిల్ కి ఎన్టీఆర్ కి వున్నా ఇష్టమే వాళ్ళ మధ్య స్నేహం మరింత బలపడటానికి కారణం అయ్యిందని కొందరు సరదాగా చెప్పే మాట. అన్నట్లు అఖిల్ కి సమంత వాచ్ రేటు చెప్పలేదు కదా..ఆ వాచ్ ఖరీదు సుమారు 4 లక్షలు…

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *