MOVIE

మహానాయకుడు హిట్టా..? ఫట్టా..? రివ్యూ % రేటింగ్

ఆంధ్రుల ఆరాధ్యదైవం నందమూరి తారక రామారావు యొక్క జీవిత్ర చరిత్రని సినిమా రూపంలోకి తీసుకోని వచ్చే ప్రయత్నం చేసారు. ఎన్టీఆర్ సినీ జీవితాన్ని కధానాయకుడు సినిమాలో చూపించారు. మిగిలిన రాజకీయ జీవితాన్ని మహానాయకుడిలో చూపించే ప్రయత్నం చేశారు.. క్రిష్ దర్శకత్వం వహించిన మహానాయకుడు సినిమా ఈ రోజే మన ముందుకి వచ్చింది. దాని విశేషాలు చూద్దాం.. సినీ రంగం నుండి రాజకీయ రంగం వైపు అడుగులువేసి 1982 లో పార్టీ ఏర్పాటు చేసి 1983 లో అధికారంలోకి వచ్చాడు. అప్పటికే ఆంధ్రప్రదేశ్ లో తమ పాలనతో ప్రజల చేత ఛీ కొట్టించుకున్న కాంగ్రెస్ యొక్క దురంహకారానికి ఎదురునిలిచి ప్రజల వ్యతిరేకతను క్యాష్ చేసుకొని తెలుగుదేశాన్ని ఎలా అధికారంలోకి తీసుకోని వచ్చాడు. ఇక గెలిచినా తర్వాత ప్రజలకి ఇచ్చిన వాగ్దానాలను ఏ విధంగా నెరవేర్చారు. రెండు రూపాయలకే కిలో బియ్యం, పక్క గృహ నిర్మాణాలు, ఆడపిల్లకి ఆస్తిలో హక్కులు,పట్వారి వ్యవస్థ రద్దు వంటి వాటి గురించి చూపించారు. ఆ తర్వాత శస్త్ర చికిత్స కోసం అమెరికా వెళ్ళినప్పుడు నాదెండ్ల భాస్కర్ రావు అధికారం చేజిక్కించుకున్నాడు. అతని ఎవరు ఎలాంటి సపోర్ట్ ఇచ్చారు, అనే వాటిని ఈ సినిమాలో చూపించారు.

NTR-Mahanayakudu-review

ఇక ముఖ్యంగా ఎన్టీఆర్ చంద్రబాబు మధ్య వున్నా అనుబంధం ఎలాంటిది, నాదెండ్ల ఎపిసోడ్ లో చంద్రబాబు ఎన్టీఆర్ కి సపోర్ట్ గా ఎలాంటి పాత్ర పోషించాడు. అనే వాటి గురించి ఈ సినిమాలో వివరంగా చూపించారు,. ఇక నటి నటుల పరంగా చూసుకుంటే ఎన్టీఆర్ బాలకృష్ణ, చంద్రబాబుగా రానా అద్భుతంగా నటించారు. ఇద్దరు పోటాపోటీగా నటించి మెప్పించారు.నాదెండ్ల పాత్ర పోషించిన సచిన్ ఖేడేకర్ తనదైన శైలిలో నటించి మెప్పించారు. మిగతా నటి నటులకి పెద్దగా స్కోప్ అనేది దొరకలేదు. హరికృష్ణ పాత్ర ఫోహించిన కళ్యాణ్ రామ్ కి కూడా స్క్రీన్ మీద పెద్దగా నటించే ఛాన్స్ అనేది రాలేదు. ఎదో ఉండాలి కాబట్టి వున్నాడు అనేలా అతని పాత్ర వుంది. ఇక మొదటి పార్ట్ కంటే కూడా సెకండ్ పార్ట్ కి కీరవాణి అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. కొన్ని సన్నివేశంలో కీరవాణి మ్యూజిక్ సినిమాని మరో లెవెల్ కి తీసుకోని పోతుంది.

అయితే సినిమాలో ఎక్కడ కూడా పెద్దగా ట్విట్స్ అనేవి లేవు. దాదాపుగా మనకి తెలిసిన కథ కావటంతో సినిమాగా సాదాసీదాగా నడిచిపోతుంది. కాకపోతే కొన్ని సన్నివేశంలో రోమాలు నిక్కబొడుచుకునే ఎమోషన్స్ అనేవి ఉంటాయి. అక్కడే దర్శకుడి పనితీరు కనిపిస్తుంది. ఇక్కడ దర్శకుడు క్రిష్ గురించి చెప్పుకోవాలి. స్టోరీ పరంగా తనకి వున్నా కొన్ని పరిమితుల్లోనే సినిమాని తీసినట్లు అర్ధం అవుతుంది.. ఎక్కడ బౌండరీ దాటటానికి ఛాన్స్ లేకుండా పోయింది. సినిమాని చూస్తే బాలకృష్ణ ఇచ్చిన స్టోరీతోనే క్రిష్ సినిమా చేసాడని అర్ధం అవుతుంది.. ఇక సినిమా రేటింగ్ విషయానికి వస్తే 2 .75 /5 ఇవ్వచ్చు

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

GAVVA.IN