MOVIE

మగబిడ్డ కోసం ఆరో కాన్పు..బిడ్డ పుట్టిన వెంటనే దారుణం..గుంటూరు లో విచిత్ర సంఘటన

 

ఒకరు ముద్దు ఇద్దరు వద్దు అనే మాటలు కేవలం నినాదంగానే మారిపోయిందా..? సంపన్నులు సైతం ఒక్కోసారి ఒక బిడ్డ చాలు అని నిర్ణయం తీసుకుంటుంటే మరో పక్క కనీసం రోజుకి మూడు పుటుల నాలుగేళ్లు సరిగ్గా నోటిలోని వెళ్లలేని వాళ్ళు మాత్రం ముగ్గురు నలుగురు పిల్లలని కంటున్నారు…పెంచే స్తొమత అనేది లేకపోవటం.ఆ తర్వాత ఏమైనా అనుకోని సంఘటనలు జరిగితే వాళ్ళందరూ అనాధులుగా మిగిలిపోతున్నారు. అలాగే ఆడపిల్ల కంటే మగపిల్లాడే మాకు కావాలని కొందరు మొండి పట్టుదలకు పోయి మగబిడ్డ కోసం ఇన్ని కాన్పులు అయినా మగబిడ్డ కోసం కంటున్నారు. తాజాగా గుంటూరు లో జరిగిన ఇలాంటి సంఘటన సంచలం సృష్టించింది.వరుసగా ఐదు కాన్పుల్లోనూ ఆడపిల్లలే పుట్టారా తల్లికి… ఆరో కాన్పులోనైనా మగబిడ్డ పుడతాడులే అనుకొంది పాపం.. కానీ ఇప్పుడూ ఆడపిల్లే పుట్టింది…. ఆరో కాన్పులో అధిక రక్తస్రావమై అసువులు బాసింది.

Guntur Delivary

గుంటూరు జిల్లా గురజాల ఎస్సీ కాలనీలో నివసిస్తున్న చిలుకూరి మేరి సునీత(26) దీనగాథ ఇది. ఆమెకు రిక్షాబండి నడుపుతూ జీవిస్తున్న నాగేశ్వరరావుతో దాదాపు పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ప్రసన్న(9), ప్రేమవతి(7), చంద్రిక(5), సాగరమ్మ(3), మరియమ్మ(1) సంతానం. బంధువులు వారించినా అబ్బాయి కావాల్సిందే అంటూ పిల్లలను కంటూపోయింది.

Guntur Suneetha

సోమవారం నొప్పులు రావడంతో గురజాల ప్రభుత్వాసుపత్రికి తర్వాత నరసరావుపేటకు.. అక్కడ పరిస్థితి విషమంగా ఉండటంతో గుంటూరు ప్రభుత్వాసుపత్రికి చేర్చగా ఆడ శిశువు జన్మించింది. శిశువు మృతి చెందగా మరో అరగంట వ్యవధిలో తల్లీ ప్రాణాలు వదిలింది. భర్త, తాము వద్దని వారించినా మగబిడ్డ కోసం పరితపించి తన కూతురు ప్రాణాలు విడిచిందని సునీత తల్లిదండ్రులు వాపోయారు.. మగబిడ్డ కావాలనే ఆ తల్లి మొండిపట్టుదల వలన ఇప్పుడు ఐదుగురు ఆడపిల్లలు తల్లి లేని అనాధలుగా మారిపోయారు..మరి వాళ్ళ పరిస్థితి ఏంటి..?

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *