MOVIE

దిల్ రాజుకి షాక్ ఇచ్చిన విజయ్ దేవరకొండ : ఇండస్ట్రీలో ఇదే హాట్ టాపిక్

      విజయ్ దేవరకొండ యూత్ లో ప్రస్తుతం అతనికి క్రేజ్ తెలుగులో మరొకరికి లేదనే చెప్పాలి . వరస హిట్స్ తో టాలీవుడ్ లో టాప్ రేంజు కి వెళ్ళిపోయాడు. ఇక అతడితో కనీసం ఒక్క సినిమా అయినా చేయాలనీ అనేక నిర్మాణ సంస్థలు పోటీ పడుతున్నాయి. గీత ఆర్ట్స్ నుండి రిలీజ్ అయినా విజయ్ దేవరకొండ కోసం చాల మంది రంగంలోకి దిగారు. తెలుగులో మంచి ఫామ్ లో వున్నా దిల్ రాజు విజయ్ దేవరకొండ తో సినిమా చేయాలనీ చూస్తున్నాడు. అందుకోసం అతని డేట్స్ అడగటానికి విజయ్ ని కలిసాడు. అయితే ఒక సినిమాకి విజయ్ డిమాండ్ చేస్తున్న రెమ్యూనరేషన్ చూసి దిల్ రాజుకి నోట మాట రాలేదు.. తన ప్రస్తుతం ఒక్కో సినిమాకి 10 కోట్లు తీసుకుంటున్నాను అంటూ దిల్ రాజుకి చెప్పాడు విజయ్. దీనితో దిల్ రాజు కి ఆ అమౌంట్ పెద్దది అని భావించి బయటకు వచ్చాడని సమాచారం.   

Vijay Devarakonda top Hero

 అయితే ప్రస్తుతం విజయ్ కి వున్నా క్రేజ్ ప్రకారం చూసుకుంటే 10 కోట్లు అనేది పెద్ద అమౌంట్ ఏమి కాదు.. క్రాంతి మాధవ్ తో చేస్తున్న సినిమాకి కూడా దాదాపు 9 కోట్ల దాక తీసుకున్నాడు.. చాల మంది 10 కోట్లు ఇవ్వటానికి కూడా సిద్దంగానే వున్నారు ..ఎందుకంటే విజయ్ దేవరకొండ మీద ఎంత పెట్టిన దాని కంటే ఎక్కువే వెనక్కి వస్తుందని వాళ్ళ నమ్మకం.. నిజానికి విజయ్ దేవరకొండ కి వున్నా క్రేజ్ ప్రకారం చుస్తే ఈ అమౌంట్ అనేది ఇంకా తక్కువే అని చెప్పాలి. సరైన సినిమా పడితే ఈజీ గా వంద కోట్లు తెచ్చే సత్తా వున్నా హీరో అతడు. అందుకే ధీమాగా 10 కోట్లు డిమాండ్ చేస్తున్నాడు. ఇంకో విషయం ఈ హీరో ఒక సూత్రాన్ని కూడా పాలో అవుతున్నాడు. అదే డిమాండ్ అండ్ సప్లై. దానికి అనుగుణంగానే సినిమాలు చేయాలి అనుకుంటూ పక్క ప్లాన్ తో ముందుకి సరిపోతున్నాడు మన కామ్రేడ్
Chat conversation end

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

GAVVA.IN