MOVIE

పెట్టిన రేటుకి అమ్ముడుకాని మహర్షి.. ఆ రేంజు మహేష్ కి లేదా…

మహేష్ అంటే తెలుగు రెండు రాష్ట్రలో విపరీతమైన ఫాన్స్ పాలోయింగ్ ఉందనేది వాస్తవం. అయితే ఆ ఫాన్స్ మాత్రం తమ హీరో సినిమా సక్సెస్ అనే టాక్ వచ్చినపుడే మాత్రమే బయటకు వచ్చి సినిమా కలెక్షన్స్ రికార్డ్స్ బద్దలు కొట్టటానికి తమ వంతు సహాయం చేస్తారు. అదే కనుక సినిమా కొంచం నెగిటివ్ టాక్ వచ్చిన కానీ, ఫాన్స్ అనే వాళ్ళు కనీసం ఆ సినిమా దరిదాపులకు కూడా వెళ్ళరు . అదే మహేష్ కి వున్నా అతి పెద్ద మైనస్. ఎన్టీఆర్ కి కానీ బన్నీ కి, సినిమా టాక్ తో సంబంధం లేకుండా ఈజీ గా 70 కోట్లు వసూళ్లు చేసే రేంజు వుంది. అందుకే ప్రస్తుతం వాళ్లిందరిని టాలీవుడ్ లో మాస్ హీరోలని అంటారు.. ఆ కోవలోకి మహేష్ ని రామ్ చరణ్ ని చేర్చాలని ఫాన్స్ ఉబలాటపడిపోతున్నారు, కానీ అది అంత సాధ్యం కాదు అనేది నిజం.. మాస్ హీరో రేంజు రావాలంటే సినిమాతో సంబంధం లేకుండా వసూళ్లు అనేది వచ్చినపుడే ఆ హీరోలు మాస్ హీరోలు అవుతారు.. కానీ మహేష్ సినిమా హిట్ అయితే పెద్ద రికార్డ్స్ బద్దలుకొడుతుంది. ప్లాఫ్ అయితే కూడా అంతే దారుణమైన రికార్డ్స్ మూటగట్టుకుంటుంది. దీనితో మహేష్ బాబుతో సినిమా అంటే ఇండస్ట్రీ సర్కిల్ లో నిర్మాతలు కొంచం భయపడుతున్నారు. కానీ అగ్ర హీరో కాబట్టి ఎవరు బయటకు చెప్పుకోలేరు. తాజాగా మహేష్ నటిస్తున్న సినిమా మహర్షి, ఈ సినిమాకి దాదాపు 140 కోట్లు ఖర్చు అయ్యినట్లు వినికిడి. అయ్యిందని చెప్పటం కంటే కూడా దర్శకుడు వంశి పైడిపల్లి ఖర్చు పెట్టించాడని చెప్పటం బెటర్.. వంశి తీసిన సినిమా ఏది కూడా అనుకున్న బడ్జెట్ లో పూర్తికాలేదు.. ఆ కోవలోనే ఈ సినిమాకి భారీ స్థాయిలో ఖర్చు పెట్టించాడు.. ముగ్గురు అగ్రశ్రేణి నిర్మాతలు కాబట్టి పెట్టుకున్నారు. అయితే సినిమాని మాత్రం ఎంత ట్రై చేసిన మొత్తం 120 కోట్లకి పైగా అమ్మలేకపోయారు. అంతే 20 కోట్లు లాస్ తోనే సినిమాని అమ్మేశారు.. సినిమా భారీ స్థాయిలో హిట్ అయ్యి అమ్మిన 120 కోట్లు వచ్చి, ఆపై 20 కోట్లు వసూళ్లు చేస్తే సక్సెస్ అయినట్లు, ఇక నిర్మాతలకి లాభం రావాలంటే సినిమా ఏ స్థాయిలో విజయం సాధించాలో మీరే అర్ధం చేసుకోండి.. చివరిగా ఒక్కమాట మా గవ్వ మీడియా మహర్షి సినిమా మొదలైన నాటి నుండి ఒక మాట చెపుతూనే వుంది. సినిమా కథకి తగ్గ బడ్జెట్ పెట్టాలి తప్ప హీరోని చూసి పెట్టకూడదని, ఆలా పెట్టబట్టే ఇంత ఇబ్బంది పడాల్సి వస్తుంది.. ఒక సూపర్ స్టార్ హీరో సినిమా ప్రస్తుతం మార్కెట్ లో సినిమా చేసిన బడ్జెట్ కి కూడా అమ్మలేకపోయారు అంతే అంత దారుణమైన పరిస్థితి కి కారణం ఏమిటో ఆలోచించండి..

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

GAVVA.IN