MOVIE

త్రివిక్రమ్ కి మొదటి షెడ్యూల్ లోనే చుక్కలు చూపిస్తున్న బన్నీ…

బన్నీ గురించి తెలిసిన వాళ్ళు చెప్పేమాట ఏమిటంటే తనకి బాగా సన్నిహితుల అయినా వారితో చాల క్లోజ్ గా ఉంటాడని, అలాగే తన తండ్రి అల్లు అరవింద్ మాట అంటే వేద వాక్కు అని తండ్రి ఆదేశిస్తే ప్రాణ స్నేహితులను కూడా వదిలిపెట్టి స్వభావం బన్నీ సొంతమని చెపుతారు. తాజాగా బన్నీ వ్యవహార శైలి గమనిస్తే అల్లు అరవింద్ డైరెక్షన్ లో వర్క్ చేస్తున్నట్లు అర్ధం అవుతుంది. అసలు విషయం ఏమిటంటే చాల గ్యాప్ తర్వాత త్రివిక్రమ్ దర్సకత్వంలో బన్నీ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే, ఆ సినిమా మొదటి షెడ్యూల్ కి ఫ్యామిలీ తో కలిసి వచ్చాడు అల్లు అర్జున్. ఆ షెడ్యూల్ ఒక ఫైట్ సీక్వెన్స్ తీశారు. అది బాగానే వచ్చింది. అంత వరకు పర్వాలేదు. కానీ అదే షెడ్యూల్ లో మరో 2 చిన్న సన్నివేశాలు తీయాలని త్రివిక్రమ్ భావించాడట, అయితే అది తెలిసి బన్నీ అగ్గిమీద గుగ్గిలం అయ్యాడని సమాచారం

. సినిమాని అనుకున్న ప్రకారమే షెడ్యూల్ చేయండి. ఒక రోజు ఎక్కువగా ఒక తక్కువగా చేయకండి, అదనంగా ఒక్క కాల్షీట్ కూడా ఇచ్చేపని లేదని ఖరాకండిగా చెప్పినట్లు అంతే కాకుండా నెక్స్ట్ షెడ్యూల్ ప్లాన్ చేసేటప్పుడు కనీసం రెండు వారాల ముందే తనకి చెప్పాలని, యూనిట్ లో జరిగే ప్రతి పని తనకి తెలియకుండా జరగటానికి లేదని స్ట్రాంగ్ గా ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తుంది. నిజానికి త్రివిక్రమ్ సినిమా అంతే బన్నీ ఇలాంటి కండిషన్స్ పెట్టె రకం కాదు.. డైరెక్టర్ ఆలోచలనకి అనుగుణంగా ముందుకి వెళ్లే మనిషి. అయితే ఇక్కడే అసలు కథ ఉంది.

ఈ సినిమాని మొదట అల్లు అరవింద్ స్వయంగా నిర్మించాలని చూసాడు. కాకపోతే త్రివిక్రమ్ కి హారిక హాసిని సంస్థకి వున్నా బాండింగ్ కారణంగా గీత ఆర్ట్స్, హారిక హాసిని రెండు సంస్థలు కలిసి నిర్మించాల్సి వస్తుంది. మొదటి షెడ్యూల్ కి అల్లు అరవింద్ స్వయంగా వచ్చి అన్ని చూసుకున్నాడు. కానీ తర్వాతి షెడ్యూల్ కి మాత్రం అల్లు అరవింద్ రాకుండా నిర్మాణ బాధ్యతలు అన్ని బన్నీకే అప్పగించినట్లు తెలుస్తుంది. దీనితో బన్నీ ఒక హీరోగా కంటే కూడా ఒక నిర్మాతగా మారిపోయినట్లు తెలుస్తుంది.. కెమెరా ముందు త్రివిక్రమ్ దర్శకత్వంలో, కెమెరా వెనుక తండ్రి దర్శకత్వంలో బన్నీ నటిస్తున్నాడు. అయితే నిర్మాతగా చేస్తూ హీరోగా చేయటం అంతే దాని తాలూకా ఎఫెక్ట్ పడే అవకాశం లేకపోలేదు.. మొదటి షెడ్యూల్ లోనే ఇలా వివాదాలు వస్తే మున్ముందు అవి ముదిరే ఛాన్సులు లేకపోలేదు..

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

GAVVA.IN