MOVIE

గరుడ దెబ్బకి.. పట్టపగలే చుక్కలు చూపిస్తున్న కల్కి

కెరీర్ దాదాపుగా అయిపొయింది, ఇక ఎందుకు ఈ తిప్పలు జగపతి బాబు మాదిరి విలన్ గా ఫిక్స్ అవుదాం అనుకున్న టైం లో రాజశేఖర్ కెరీర్ లో గరుడ వేగా సినిమా వచ్చింది. మొదటి ఈ సినిమా మీద ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు. అయితే సినిమా విడుదల తర్వాత మంచి సక్సెస్ అందుకుంది. సినిమాకి పెట్టిన ఖర్చు ఎక్కువ కావటంతో లాభాలు పెద్దగా రాలేదు కానీ, హీరోగా రాజశేఖర్ మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు. దాని తర్వాత చాల సినిమా ఆఫర్స్ వచ్చిన కానీ, తొందర పడకుండా ప్రశాంత్ వర్మ చెప్పిన కల్కి కథని తెలివిగా ఎంచుకొని సెట్స్ మీదకి తీసుకోని వెళ్ళాడు. మొదట పోస్టర్ రిలీజ్ అయినప్పుడే సినిమాలో ఎదో విషయం వుండే ఉంటుందని భావించారు.

అందుకే సినిమా మీద అయినా ఖర్చుకి 40 % ఎక్కవే ఇచ్చి నిర్మాత కేకే రాధామోహన్ రైట్స్ మొత్తం తీసుకున్నాడు. ఈ విధంగా కల్కి సినిమా విడుదలకి ముందే టేబుల్ ప్రాఫిట్ సంపాదించింది. ఈ సినిమా శాటిలైట్స్ రైట్స్ విషయంలో కూడా తన దూకుడు చూపిస్తుంది. గతంలో ఈ సినిమా శాటిలైట్స్ రైట్స్ 2 కోట్లకి అటు ఇటు గా చెప్పారు. ఎప్పుడైతే కల్కి టీజర్ విడుదల అయ్యి, మంచి ప్రశంసలు సంపాదించిందో ఒక్కసారిగా శాటిలైట్స్ రైట్స్ ముందు చెప్పిన దానికంటే 2 రేట్లు పెంచి దాదాపు 6 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అయినా సరే ఆ రైట్స్ కోసం టాప్ తెలుగు 3 చానెల్స్ పోటీపడుతున్నాయి.

మరో పక్క డిజిటల్ రైట్స్ విషయంలో కూడా తీవ్ర పోటీ వుంది. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ ఒక ఫిగర్ ఫిక్స్ చేసినట్లు వినికిడి, అయితే కొత్తగా డిజిటల్ ప్లాట్ ఫామ్ మీదకి వచ్చిన “జి సంస్థ” జి5 అనే డిజిటల్ స్ట్రీమ్ స్టార్ట్ చేసింది. ఆ సంస్థ కూడా ఈ సినిమా రైట్స్ విషయంలో పోటీకి వచ్చింది. దీనితో డిజిటల్ రైట్స్ కి ఫుల్ డిమాండ్ వచ్చింది. ఇక ఈ వ్యవహారాలు అన్ని జీవిత దగ్గర వుంది చూస్తున్నట్లు తెలుస్తుంది.. కల్కి కి ఈ రేంజు లో డిమాండ్ రావటానికి గరుడ వేగ సినిమానే కారణం.. ఇక సినిమాకి ఈ రేంజు లో ఆదరణ రావటం చూసి మన యంగ్ యాంగ్రీ మన్ రాజశేఖర్ ఫుల్ ఖుషి అవుతున్నాడు.

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

GAVVA.IN