MOVIE

ఏరా నవ్వుతున్నావు..ఆపవే నా తల్లి.. కీర్తిని ఆడుకున్న రానా,నాని..

టాలీవుడ్ లో హీరోల మధ్య మంచి రిలేషన్ అనేది ఇప్పుడు బాగా ఉంది. రానా లాంటి హీరోలు అయితే ఇండస్ట్రీలో అందరి హీరోలతో మంచి బాండింగ్ అనేది మెయింటన్స్ చేస్తూ వున్నారు. ఇక రానా హోస్ట్ గా నెంబర్ వన్ యారి అనే ప్రోగ్రాం సెకండ్ సీజన్ నడుస్తుంది. ఇప్పటికే ఈ షో కి టాలీవుడ్ టాప్ సెలెబ్రటీస్ అందరు వస్తున్నారు. తాజాగా ఈ వారం నేచురల్ స్టార్ నాని అలాగే మహానటితో టాప్ హీరోయిన్స్ సరసన చేరిన కీర్తి సురేష్ ఇద్దరు వచ్చారు. బేసిక్ గా రానా చాలా కామెడీ పర్సన్, ఇక అతడికి తోడుగా నాని కూడా కలిశాడు. దీనితో కీర్తి సురేష్ ని ఇద్దరు కూడా ఒక ఆట ఆదుకున్నారు.

 ఇక చిన్న చిన్న టాస్క్ లో భాగంగా నాని కీర్తి కి 10th క్లాస్ కి సంబంధించి ఒక బుక్ అనేది అమ్మాలి. దాని గురించి చెప్పేటప్పుడు ఎక్కడ కూడా గ్యాప్ అనేది తీసుకోకూడదు. దీనితో నాని చాల స్పీడ్ గా దాని గురించి చెపుతూ ఉంటే, ఏరా అంత స్పీడ్ గా చెపితే ఎలా అని కీర్తి అనేసరికి అక్కడ ఒక్కసారిగా నవ్వులు పూశాయి. ఇక ఆ తర్వాత మరో టాస్క్ లో కీర్తి కళ్ళకి క్లాత్ కట్టేసి నాని ఇచ్చిన వాటిని చేతితో పట్టుకొని వాటి పేర్లు అనేవి చెప్పాలి. ఇందులో మొదటిగా లిప్ స్టిక్ ఇచ్చారు..దానిని కీర్తి ఈజీ గానే చెప్పేసింది. ఆ తర్వాత నాని పాము బొమ్మని తీసుకోని కీర్తి ఇస్తూ నవ్వుతున్నాడు. ‘ఏంటి రా ఆలా నవ్వుతున్నావు’ అంటూ కీర్తి అడిగింది. నాని ఏమి చెప్పకుండా పాము కీర్తికి ఇచ్చాడు..దానిని టచ్ చేసి పెద్దగా కేకలు వేస్తూ నానిని కొట్టటం స్టార్ట్ చేసింది కీర్తి. ఇలా మహానటిని ఒక రేంజు లో ఆడేసుకున్నారు. ముఖ్య విషమేమిటంటే నానిని కీర్తి అంత క్లోజ్ గా ‘ఏరా ఏరా’ అని అనటం.. చూసేవాళ్ళకి ఇది కొంచం విచిత్రంగా అనిపించవచ్చు కానీ వాళ్లిద్దరూ చాలా మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అనే విషయం ఇండస్ట్రీలో బాగానే తెలుసు.. వీళ్లిద్దరు కలిసి ‘నేను లోకల్’ అనే సినిమాలో నటించారు. అప్పటి నుండి ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం అనేది ఉంది..

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *