MOVIE

ఎలక్షన్ ఎఫెక్ట్స్ తో ప్లాన్ మార్చుకున్న మహర్షి…

మహేష్ బాబు తాజా గా నటిస్తున్న సినిమా మహర్షి. ఈ సినిమా కి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజ్, అశ్వినీదత్,పీవీపీ, లు ఈ సినిమా ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గరకు వచ్చింది. ఈ సినిమా పోమోషన్స్ లో భాగం గా పెద్ద ఎత్తున ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించాలని చిత్ర యూనిట్ భావించారు. అందులో భాగం గా నెక్లస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజా లో ప్లాన్ చేసి దానిని సక్సెస్ ఫుల్ గా చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.గతంలో భరత్ అనే నేను సినిమా ఫంక్షన్ ను ఎల్బీ స్టేడియం లో ఏర్పాటు చేసారు,అయితే ఆ సమయం లో గ్రౌండ్ పాడయిపోయిందని టాక్ వచ్చింది. ఈ సారి కూడా మహర్షి మూవీ ఫంక్షన్ ను అక్కడే ఏర్పాటు చేసేందుకు ట్రై చేసారు కానీ ఆ ప్రాంతం లో ఈవీఎమ్ మెషిన్లు వుండటం కారణం గా అక్కడ ఏర్పాటుకు అనుమతి ఇవ్వలేదని తాజాగా వస్తున్నా సమాచారం.

అందుకే ఈ సారి నెక్లస్ రోడ్ ను ఎంచుకున్నారు. ఎలాగూ మే 1 న మేడే కాబట్టి ఆ రోజు న సెలవు, అదీకాక సమ్మర్ సీజన్ కాబట్టి ఆ ప్రాంతం లో జనాలు ఎక్కవగా వుంటారు. దీనికి తోడు మహేష్ బాబు ఫాన్స్ కూడా వస్తారు. మహర్షి ఫంక్షన్ ఇక ఓ రేంజ్ లో వుండే అవకాశం వుంది. ఇదిలా ఉంటే ఫంక్షన్ కు ఎవరెవరొస్తారు అన్నది ఒక ప్రశ్నగా మిగిలింది…? మహేష్ బాబు తండ్రి కృష్ణ గారు ఎలాగూ తప్పనిసరిగా ఫంక్షన్ కి వస్తారు.కృష్ణ గారితో పాటు ఫంక్షన్ కి ఇంకా ఎవరొస్తారా..? అన్నది ప్రశ్న..? లాస్ట్ టైం భరత్ అనే నేను మూవీ ఫంక్షన్ కు ఎన్టీఆర్ స్పెషల్ ఎంట్రీ ఇవ్వడం వలన ఎట్ట్రాక్షన్ గా నిలిచారు. ఈ సారి ఏ హీరో ఎంట్రీ ఇస్తారా అన్నది ప్రశ్న గా మారింది..? ప్రస్తుతానికైతే రామ్ చరణ్ కి గాయం కావటం తో rrr షూటింగ్ కి బ్రేక్ ఇచ్చారు. బహుశా వాళ్ళల్లో ఎవరో ఒకరు ఫంక్షన్ కి వచ్చే అవకాశం లేకపోలేదు. కొరటాల శివ లాంటి కొద్దీ మంది డైరెక్టర్లు కూడా ఈ ఫంక్షన్ కి హాజరు అవుతున్నట్లు నెటిజన్లు వినిపిస్తున్న సమాచారం. మరి ఫంక్షన్ కు ఎవరెవరొస్తారన్నది మే దాక ఎదురు చూడాల్సిందే…

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

GAVVA.IN