MOVIE

ఇరకాటంలో ఎన్టీఆర్…అదే కనుక జరిగితే మెగా ఫాన్స్ ఊరుకోరు ..

జూనియర్ ఎన్టీఆర్ పేరులోనే జూనియర్ కానీ అతను సీనియర్ లకే సీనియర్ లాంటివాడు..టాలీవుడ్ లో టప్ గేర్ లో దూసుకొనిపోతున్నాడు ఈ యంగ్ యమా..తాజాగా జూనియర్ ఎన్టీఆర్ గురించి ఒక వార్త చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే మెగాహీరో సాయి ధరమ్ తేజ్ సరికొత్త సినిమా చిత్రలహరి సినిమా ప్రో రిలీజ్ ఫంక్షన్ కి ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా రాబోతున్నాడు అనే ప్రచారం నడుస్తుంది. రామ్ చరణ్ ఎన్టీఆర్ ఎంత క్లోజ్ గా వుంటారో అందరికి తెలుసు. అలాగే గతంలో సాయి ధరమ్ తేజ్ సినిమాకి ఓపెనింగ్ ఎన్టీఆర్ రావటం కూడా జరిగింది. దానికి తోడు ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు వాళ్లతో ఎన్టీఆర్ కి మంచి అనుబంధమే ఉంది…ఎన్ని లింక్స్ ఉండటంతో ఎన్టీఆర్ ని ఈ సినిమాకి చీఫ్ గెస్ట్ గా పిలిస్తే సినిమాకి మంచి క్రెజ్ వస్తుంది. ఎన్టీఆర్ ఫాన్స్ సపోర్ట్ కూడా సినిమాకి వస్తుందనే ఆలోచనతో చిత్ర యూనిట్ ఉంది.

అయితే ఇక్కడ అసలు సమస్య ఏమిటంటే మెగా ఫ్యామిలీలో ఏ హీరో ఫంక్షన్స్ జరిగిన అక్కడ పవన్ కళ్యాణ్ నామ స్మరణ అనేది జరుగుతుంది. మెగా హీరోల ఫంక్షన్స్ కి ఏ హీరో వచ్చిన కానీ పవన్ కళ్యాణ్ ఫాన్స్ గోల గోల చేస్తారు. గతంలో అల్లు అర్జున్ సహనం కోల్పోయి చెప్పను బ్రదర్ అనేసరికి ఎంత పంచాయితీ జరిగిందో అందరికి తెలుసు. అలాగే డార్లింగ్ ప్రభాస్ కి కూడా ఒక్కసారి ఈ అనుభవం ఎదురైంది ..అయితే దాని నుండి చాల స్మార్ట్ గా బయటపడ్డాడు.. ఇప్పుడు ఎన్టీఆర్ కనుక మెగా ఫంక్షన్ కి వస్తే అక్కడికి కచ్చితంగా పవన్ ఫాన్స్ వస్తారు.. అసలే ఎలక్షన్స్ టైం మెగా ఫాన్స్ మొత్తం పవన్ కళ్యాణ్ కోసం రంగంలోకి దిగివున్నారు. ఇలాంటి టైంలో జరిగే ఆడియో ఫంక్షన్స్ లో కచ్చితంగా

పవన్   నానా రచ్చ చేయటం ఖాయం..ఎన్టీఆర్ స్టేజి ఎక్కి మైక్ తీసుకున్న తర్వాత పవన్ గురించి మాట్లాడాలని ఫాన్స్ గోల చేస్తారు… అక్కడ తప్పించుకునే ఛాన్స్ మాత్రం ఉండదు… ఒక వేళ మాట్లాడితే అది మొదటికే మోసం రావచ్చు. ఎన్టీఆర్ సొంత పార్టీ అయినా టీడీపీ కి దూరంగా ఉంటున్నాడు. పవన్ కళ్యాణ్ ఏమో జనసేన అంటూ ఆంధ్ర టీడీపీ తో పోటీకి దిగాడు. ఇలాంటి టైం లో తారక్ పవన్ గురించి మాట్లాడితే టీడీపీ సోకాల్డ్ అభిమానులకి అది నచ్చదు. దీనితో సోషల్ మీడియాలో వార్ అనేది స్టార్ట్ అవుతుంది. ఒక వేళ స్టేజి మీద మాట్లాడకపోతే పవన్ ఫాన్స్ ఊరుకోరు. అది మరింత ప్రమాదం సో ఇవన్నీ తెలిసి ఎన్టీఆర్ ఈ ఫంక్షన్ కి దాదాపుగా రాకపోవచ్చు…ఒకవేళ వస్తే మాత్రం అక్కడ జరిగే పరిణామాలు మాత్రం కొన్ని రోజులు టాలీవుడ్ లో మార్మోగిపోవటం మాత్రం పక్క

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

GAVVA.IN