POLITICAL NEWS

టీడీపీకి మరో షాక్…రాజీనామా చేసిన ఫైర్ బ్రాండ్

తెలుగుదేశం పార్టీకి వరసబెట్టి షాక్ లు మీద షాక్ లు తగులుతూనే ఉన్నాయి. ఎన్నికల్లో ఓడిన నాటి నుండి నేటి వరకు టీడీపీకి దిన దిన గండంగా తయారైంది. ఎప్పుడు ఎవరు పార్టీకి గుడ్ బై చెపుతారో, ఎవరు ఎప్పుడు రెబల్ గా మారిపోతారో తెలియక ఏకంగా చంద్రబాబు నాయుడు తికమక పడుతున్నాడు. తాజాగా టీడీపీ మరో బిగ్ షాక్ తగిలింది. టీడీపీ ఫైర్ బ్రాండ్ గా చెప్పుకునే యామిని సాధినేని టీడీపీ పార్టీకి రాజీనామా చేసి, బీజేపీలోకి వెళ్ళిపోనుందా?. ఈ పరిణామం నిజముగా టీడీపీ పార్టీకి తీరని నష్టమే అని చెప్పాలి.అతి తక్కువ కాలంలోనే ఆమె టీడీపీలో అధికార ప్రతినిధి హోదాని దక్కించుకుంది. ఆమె మీడియా ముందుకి వస్తుందంటే ప్రత్యర్థులకు వణుకుపుట్టేది. పదునైన మాటలతో ప్రత్యర్థులకు చుక్కలు చూపించేది.

చంద్రబాబు, లోకేష్ మీద ఎలాంటి విమర్శలు వచ్చిన కానీ వాటికీ తనదైన రీతిలో కౌంటర్లు ఇస్తూ టీడీపీ ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకుంది, అలాంటి యామని శర్మ టీడీపీ వదిలి బీజేపీలోకి వెళ్ళిపోనుంది. దీనికి సంబంధించి నిన్న కొన్ని ఫోటోలు ఆన్ లైన్ లో దర్సనం ఇచ్చాయి. ఆమె మరికొందరు బీజేపీ నేతలతో కలిసి, కన్నా లక్ష్మీనారాయణని కలిసింది.దీనితో ఆమె బీజేపీలోకి వెళ్లబోతుందనే విషయం తెలిసింది, గత కొద్దీ రోజులుగా ఆమె అనుకున్న పనులు సరిగ్గా జరగటం లేదు. ఎన్నికల సమయంలో కులం కార్డు ఉపయోగించి చంద్రబాబు నాయుడుని ఇరుగున పెట్టి ఎమ్మెల్యే సీట్లు అడగాలని మిగతా నాయకులను రెచ్చకొడుతూ ఆమె మాట్లాడిన ఆడియో రికార్డ్స్ బయటకు వచ్చాయి. అప్పటి నుండి టీడీపీలో ఒక వర్గం ఆమెకి వ్యతిరేకంగా ఉన్నారు. దీనితో ఆమెకి పార్టీలో తగిన గుర్తింపు రావటంలేదు. అందుకే పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *