POLITICAL NEWS

కూకట్ పల్లి పొలిటికల్ సర్వే.. సుహాసిని సత్తా ఎంత..? మాధవరం మాటేమిటి..? కాంతారావు కథేమిటి..?

కూకట్ పల్లి తెలుగు రెండు రాష్ట్రలో బాగా పరిచయమున్న నియోజకవర్గం.. హైదరాబాద్ లో కూకట్ పల్లి గడ్డ అంటేనే ఆంధ్ర అడ్డా అనే నినాదాలు వినిపిస్తాయి. దానికి తగ్గట్లే ఇక్కడ సీమాంధ్రులు ఎక్కువ.. గతంలో ఖైరతాబాద్ నియోజకవర్గంలో వున్నా కూకట్ పల్లి నియోజకవర్గ పునర్విభజనలో భాగంగా 2009 లో దాదాపు 2 . 50 వేల ఓట్లతో నియోజకవర్గం ఏర్పాటు అయ్యింది. 2009 ఎన్నికలో తెలుగుదేశం సపోర్ట్ తో లోకసత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ ఇక్కడ MLA గా గెలిచాడు. 2014 లో తెలుగుదేశం అభ్యర్థి  మాధవరం కృష్ణ రావు MLA గా గెలిచి తెరాస లోకి వెళ్ళిపోయాడు. ఈ నియోజకవర్గం మొదటి నుండి కూడా టీడీపీ కి అనుకూలం అనేది ఓపెన్ సీక్రెట్.. గత బల్దియా ఎలక్షన్స్ లో 149 డివిజన్ లో టీడీపీ ఓడిపోయినా కానీ ఒక్క KBHP డివిజన్ నుండి మందాడి శ్రీనివాస్ రావు గెలిచాడు అంటే అర్ధం చేసుకోవచ్చు అక్కడ తెలుగుదేశం పార్టీ ఎలా ఉందొ. 3 లక్షల 40 వేల ఓటింగ్ ఉన్న అక్కడ దాదాపు 2 లక్షల మంది ఆంధ్ర ఓటర్లు వున్నారు. వాళ్లలో 80 శాతం మంది తెలుగుదేశం అనుకూల వ్యక్తులే. అయితే ఈ అవకాశాన్ని నందమూరి సుహాసిని ఎలా ఉపయోగించుకొని విజయం సాధిస్తుందో చూడాలి…
సుహాసిని గారి గురించి చెప్పాలంటే.. అనుకోకుండా తెరమీదకి వచ్చిన నాయకురాలు. నిజానికి కూకట్ పల్లి నియోజకవర్గ పరిధి ఎంత ఉందో కూడా ఆమెకి సరిగ్గా తెలియదు. అయితే హరికృష్ణ మరణం తర్వాత నందమూరి వాళ్ళకి అవకాశం ఇవ్వాలని, అలాగే ఈ అసెంబ్లీ స్థానం పక్కాగా తెలుగుదేశం గెలుస్తుందనే నమ్మకం వుంది. ఇక్కడ బయటవాళ్ళని నిలబెడితే వాళ్ళు తర్వాత కాలంలో వేరే పార్టీలకు జంప్ కావచ్చు అదే సుహాసిని అయితే నమ్మకంగా ఇక్కడే ఉంటుందని ఆలోచనతో ఆమెని నిలబెట్టారు. అయితే ఇక్కడ తెలుగుదేశం వాళ్ళకి ఓట్లు వేసేవాళ్ళు వున్నా కానీ, నిలబడి ఓటు వేప్పించుకునే వాళ్ళు, పనులు చేసేవాళ్ళు లేరని లోకల్ గా తెలుగుదేశం బడా నాయకులూ చెపుతున్న మాట.. ఎలాగూ ఆంధ్ర వాళ్ళు ఎక్కువ దానికి తోడు హరికృష్ణ సెంటిమెట్ అంటేంది వర్క్ అవుట్ అయ్యే అవకాశాలు వున్నాయి కాబట్టి సుహాసిని ఇంకాకొంచం కష్టపడితే MLA గా అసెంబీలోకి అడుగుపెట్టవచ్చు..అయితే ఇప్పుడున్న నాయకుల్లో ఎంత మంది సుహాసిని తోడుగా నడుస్తారో ఎంత మంది వెన్నుపోటు పొడుస్తారో చెప్పలేని పరిసితి వుంది.
బలాలు:
 • ఎన్టీఆర్ కుటుంబ ఆడపడుచు కావటం..
 • ఈ నియోజకవర్గంలో టీడీపీ కి మంచి పట్టు ఉండటం..
 • ఓటర్లలో ఎక్కువ శాతం ఆంధ్ర నుండి వచ్చి స్థిర పడినవారు కావటం
బలహీనతలు:
 • నియోజకవర్గంలో పార్టీ పరంగా సరైన నాయకత్వం,సమన్వయము అనేది లేకపోవటం..
 • కొత్త వచ్చిన షహాసిని వెంట నమ్మకంగా నడిచేవాళ్ళు లేకపోవటం..

 

ఈయన 2014 లో తెలుగుదేశం తరుపున బంపర్ మెజారిటీ తో గెలిసి ఆ తర్వాత స్వలాభాలు కోసమో లేక నియోజకవర్గ అభివృద్ధి కోసమో కానీ అధికారపార్టీ కి మారిపోయాడు. అయన పార్టీ మారిన కొత్తలో టీడీపీ క్యాడర్ మాత్రం వెళ్లకుండా అలాగే ఉండిపోయింది. అయితే కృష్ణ రావు తెరాస లోకి వెళ్ళిన తర్వాత టీడీపీ శ్రేణులను ముందుది నడిపే సరైన నాయకుడు లేడు.. దీనితో చిన్న చిన్న అవసరాల కోసం టీడీపీ క్యాడర్ కృష్ణరావు పక్కన నడవాల్సి వచ్చింది. దానిని బాగా అభివృద్ధి పరముగా మంచి మార్కులే వేయవచ్చు..తాగునీటి వసతులు, పార్కులు, క్రీడా మైదానాలు లాంటివి బాగానే ఏర్పాటు చేసారు. ప్రతి రోజు ఉదయం పార్టీ ఆఫీసులో కార్యకర్తలకి అందుబాటులో వుంటూ మంచి మార్కులే సంపాదించాడు. అయితే ఆ నియోజకవర్గంలో జరిగే అనేక రియల్ ఎస్టేట్ వ్యవహారాల్లో జోక్యం చేసుకునేవాడనే విమర్శలు కూడా లేకపోలేదు..అయితే ప్రధానంగా తాను స్థానికుడిని  గెలిపిస్తే అందుబాటులో ఉంటానని, టీడీపీ అభ్యర్థి స్థానికేతురాలని ఆమె సరిగ్గా అందుబాటులో ఉండదని విషయాన్ని బలంగా చెపుతూ ప్రచారం చేస్తున్నాడు..
బలాలు:
 • నాలుగున్నరేళ్లలో మంచి అభివ్రుది పనులు ..చాల వరకు ప్రజలకు అందుబాటులో ఉండటం…
 • పార్టీ కార్యకర్తలను కొత్తగా తయారు చేసుకోవటం
బలహీనతలు :
 • ప్రవైట్ నిర్మాణ పనుల్లో జోక్యం చేసుకోవటం..కొంతమంది అనుచరులు బిల్డర్లను బెదిరించి లంచాలు తీసుకోవటం
 • కొన్ని అనైతిక కార్యకలాపాలు చేయటం

అయన తెరాస అభ్యర్థి మాధవరం కృష్ణ రావు కి చాలా దగ్గరి బంధువు..2009 లో బీజేపీ తరుపున పోటీచేసిన ఆయనకి 10 వేలు ఓట్లు అనేవి వచ్చాయి. ఆ తర్వాత 2014 లో పొత్తులో భాగంగా TDP కి సపోర్ట్ చేసాడు. ఈసారి మాత్రం మళ్ళీ బీజేపీ తరుపున బరిలో నిలిచి ఎలానైనా గెలవనే పట్టుదలతో వున్నాడు.. అవసరం అయితే బీజేపీ పెద్దలతో ప్రచారం చేపించాలని చూస్తున్నాడు.కానీ కూకట్ పల్లి లో నిజమైన పోటీ అనేది మాత్రం తెరాస మరియు టీడీపీ మధ్యనే అని చెప్పాలి.. టీడీపీ అంటే ప్రజకూటమి…
బలాలు :
 • 2009 లో ఓడిన కానీ ఈ పదేళ్లు నియోజకవర్గంలోనే ఉండటం ..
 • ప్రజా సమస్యలపై ఎప్పుడు పోరాటాలు చేయటం..అధికారం వున్నా లేకపోయినా అందరికి అందుబాటులో ఉండటం
బలహీనతలు :
 • బీజేపీ పార్టీ ఈ నియోజకవర్గంలో బలంగా లేకపోవటం..
 • చెప్పుకోదగిన నాయకులూ ఇక్కడ లేకపోవటం…
 • అన్ని ప్రాంతాలపై పట్టు లేకపోవటం

 

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *