POLITICAL NEWS

ఎన్టీఆర్ రాజకీయాలకి ఆమె ప్రధాన కారణమా..?

తెలుగుదేశం పార్టీ గురించి ఎవరు మాట్లాడిన కానీ చంద్రబాబు తర్వాత పార్టీ అధినేత ఎవరు అనే దాని గురించే ఎక్కువగా చర్చిస్తున్నారు.. లోకేష్ కి పార్టీ ని నడిపే సత్తా లేదనేది అందరు మాట్లాడుకునే మాటలే, అందుకే రాబోయే కాలంలో టీడీపీకి కాబోయే నాయకుడు ఎవరు అనేది పెద్ద చర్చనీయాంశంగా మారిపోయింది. అందులో నూటికి 90 శాతం మంది జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే టీడీపీని ముందుకి నడిపించే సత్తా వున్నా నాయకుడని, చంద్రబాబు తర్వాత టీడీపీ పగ్గాలు అందుకునే దమ్మున్న మొనగాడు ఒక్క ఎన్టీఆర్ మాత్రమే అని కుండ బద్దలు కొట్టి మరి చెపుతున్నారు.. నిజ నిజాలు పరిశీలిస్తే కూడా అది నిజమే అని అర్ధం అవుతుంది.

2009 లో కొన్ని రోజులు మాత్రమే ప్రచారం చేసిన ఎన్టీఆర్ ని చుస్తే మాత్రం రాజకీయ రంగంలో ఉన్నత శిఖరాలు అధిరోహించే గొప్ప నాయకుడని ఫీలింగ్ కలుగుతుంది. అది గమనించే చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ని దూరం పెట్టాడనేది వాస్తవం.. ఇక ఎన్టీఆర్ 2024 లేదా 2029 ఎన్నికలో టీడీపీ తరుపున అధికారికంగా పగ్గాలు చేప్పట్టి రాజకీయ రణరంగంలోకి దూకబోతున్నాడు అనేది ఇప్పటికి వస్తున్నా సమాచారం. అయితే రాజకీయాలు అనేవి అంత సులభం కాదు.. ఎవరిని నమ్మటానికి ఛాన్స్ లేదు…ఆలా అని నమ్మకపోతే పనులు జరగవు. ఇక్కడే అనుభవం అనేది చాల అవసరం.. ఎన్టీఆర్ కి కొంచం టైం ఇస్తే చాలు ఏ టాపిక్ అయినా దాని లోతుల్లోకి వెళ్లి తెలుసుకునే సత్తా అయితే వుంది, కానీ రాజకీయాల్లో టైం దొరకటం చాల కష్టం.

అయితే ఎన్టీఆర్ కి ఆ విషయంలో పెద్దగా భయపడే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఎన్టీఆర్ కి సపోర్ట్ గా అతని మేనత్త హరికృష్ణ ,బాలకృష్ణ సోదరి అయినా సీనియర్ రాజకీయ నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఉన్నట్లు అర్ధం అవుతుంది.. ఎన్టీఆర్ కి రాజకీయంగా అవసరమైన సలహాలు ఇవ్వటానికి ఆమె సిద్దమైనట్లు సమాచారం. ఎన్టీఆర్ కి ఆమె అంటే ఎనలేని అభిమానమని తెలుసు.. ఆమెకి కూడా ఎన్టీఆర్ అంటే చాల ఇస్తామని, ఎన్టీఆర్ కి సలహాలు ఇచ్చే అంత గొప్ప గౌరవం ఇస్తే తప్పకుండా నా సహాయం అందిస్తానని చెప్పింది.. పైకి ఆలా చెపుతున్న కానీ, వెనుక మాత్రం ఎన్టీఆర్ ఎప్పుడు రాజకీయ ప్రవేశం చేస్తే మంచిది.. ఎలా కథ నడిపించాలి, టీడీపీ పగ్గాలు ఎన్టీఆర్ చేతిలోకి ఎలా తీసుకోని రావాలనే పక్క ప్లాన్ ఆమె వేస్తున్నట్లు సమాచారం.. దానికి తోడు ఒక్కప్పుడు పెద్ద ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు తోడుగా నిలిచినా దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా జూనియర్ కి సపోర్ట్ గా ఉన్నాడనేది వాస్తవం…ఆనాడు టీడీపీ పార్టీ చంద్రబాబు చేతిలోకి వెళ్ళటానికి సహకారం అందించిన దగ్గుబాటి ఫ్యామిలీ, నేడు అదే టీడీపీ ని చంద్రబాబు హస్తాల నుండి ఎన్టీఆర్ చేతిలోకి తీసుకోని రావటానికి తమ వంతు ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది..

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *