POLITICAL NEWS

బాలయ్య ఫాన్స్ కి తిరిగి సమాధానం ఇచ్చిన మెగా బాబు

గత కొద్దీ రోజులుగా నాగబాబు బాలయ్య మీద చేసిన కామెంట్స్ గురించి అందరికి తెలిసిందే…ఆ కామెంట్స్ కి ప్రతీకారంగా బాలయ్య ఫాన్స్ ఎలా ఆడుకుంటున్నారో కూడా మనం వింటూనే ఉన్నాం..కానీ ఈసారి మన బాలయ్య నే స్వయంగా రంగంలోకి దిగారు..నాగబాబు మాటలకి చాల ఘాటుగా స్పందించారు ..ఇప్పటి వరకు ఇండైరెక్ట్ గా వ్యాఖ్యలు చేసిన నాగబాబు తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా వీడియోలను విడుదల చేస్తూ వస్తున్నాడు.ఇది చుసిన యూజర్లు ఎవరికీ వారుగా  అవతలి వారిమీదికి ఘాటుగా స్పందిస్తున్నారు…అసలు నాగబాబు బాలయ్య మీద ఎందుకు ఆలా కామెంట్లు చేయాల్సివచ్చిందో ఆ వీడియోలో క్లీర్గ వివరించారు..

 

.గతంలో బాలయ్య తన అన్న ,మరియు తమ్ముడి మీద పెద్ద ఎత్తున  విమర్చించారు.గతంలో బాలకృష్ణ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఎవరో తెలియదు అన్నాడు – దానికి కామెంట్ నెం.1 అంటూ నాగబాబు ఒక వీడియో పోస్ట్ చేశాడు. ఆ తర్వాత బాలకృష్ణ చేసిన ‘ఒకరిని హీరోను చేయడం మాకు ఇష్టం లేదు – మేమే సూపర్ స్టార్స్….’ అన్న మాటలకి కామెంట్ నెం.2 అంటూ వీడియోను విడుదల చేశాడు.ఇక మూడవ వీడియో లో అమితాబ్ ఏం పీకాడు – చిరంజీవి ఏమైంది – మేము వేరు – మా బ్లడ్ వేరు – మా బ్రీడ్ వేరు వ్యాఖ్యలకు కామెంట్ నెం.3 అంటూ వీడియో విడుదల చేశాడు ఈ మూడు వీడియోల్లో నాగబాబు బాలయ్య మీద కాస్త ఘాటుగానే స్పందించారు…

 

 

ఇండస్ట్రీలో మీరు మాత్రమే సూపర్ స్టార్స్ కాదు – ఎంతో మంది స్టార్స్ ఉన్నారు. అమితాబ్ వంటి వారిని ఏం పీకారు అంటూ ప్రశ్నించావు. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఎన్టీఆర్ స్థాయిలో అమితాబచ్చన్ – ఎంజీఆర్ – ఏయన్నార్ లు నిలిచారు. వారికి గౌరవం ఇవ్వాలి. అలంటి సమయంలో తన అన్న ఐన చిరంజీవి పేరు ప్రస్తావయించాల్సిన అవసరం లేదు కదా అని ప్రశ్నించాడు…రా – ఆస్ట్రియా – ఇంగ్లాండ్ ల్లో రాజవంశస్తులు బ్లడ్ – బ్రీడ్ అంటూ మాట్లాడితే అక్కడి జనాలు తొక్కి పారేశారు. మీరు ఏది పడితే అది మాట్లాడితే అన్నయ్య చిరంజీవి – తమ్ముడు పవన్ కళ్యాణ్ లు పట్టించుకోరు – వరుణ్ – చరణ్ వంటి వారు ఇలాంటి వాటి జోలికి వెళ్లరు. మీరు ఏది మాట్లాడినా చెల్లి పోతుందనుకుంటే మాత్రం మీ పొరపాటే అంటూ నాగబాబు ఘాటుగా స్పందించాడు. ,,ఇంకా గతంలో బాలయ్య అన్న మాటలకి సంబంధించి ఇంకో 3  వీడియోలు చేయడానికి సిద్ధంగా ఉన్నాయట…ఏంటో ఈ వివాదం కాస్త ముగిసినది అనుకుంటే రోజు రోజుకి కాస్త పెరుగుతూనే వస్తుంది కదా..ఇక ఈ వీడియో లని చూసి ఐన మన బాలయ్య కాస్త మాట్లాడుతాడో లేదో చూడాలి..

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *