POLITICAL NEWS

మోహన్ బాబు పనిలేక వైస్సార్సీపీ లో చేరలేదు…అతని లెక్క తెలిస్తే షాక్ అవుతారు…

సినీ హీరో మంచు మోహన్ బాబు తాజాగా వైస్సార్సీపీ పార్టీ లో చేరిపోయాడు. ఎప్పటినుండో తెరవెనుక వైస్సార్సీపీ సానుభూతి పరుడైన మోహన్ బాబు ఈ సరి ఆ ముసుకు తొలగించుకొని వైసీపీ తీర్థం పుచుకున్నాడు. అయితే మొన్నటికి మొన్న తిరుపతిలో ధర్నా చేసిన సమయంలో వైసీపీ లో జాయిన్ అవుతున్న అంటూ ఎలాంటి లీక్ కూడా ఇవ్వని మోహన్ బాబు ఇలా చెప్పాపెట్టకుండా వైసీపీ లో దూకటం వెనుక బలమైన కారణమే ఉందని తెలుస్తుంది.. మొన్న చేసిన ధర్నా వలన టీడీపీ మీద కొంచం వ్యతిరేకత అనేది వచ్చింది. ఆ తర్వాత అది మోహన్ బాబుకి ఎఫెక్ట్ అయ్యి అతని లెక్కల బాగోతం బయటకు వచ్చింది అనుకోండి అది వేరే విషయం. ఒక సినిమా ఫ్యామిలీ గా ఒక విద్య సంస్థల అధినేతగా మోహన్ బాబు ఫ్యామిలీకి మంచి సర్కిల్ అనేది ఉంది.. ఇప్పటికే సినిమా వాళ్ళు కొందరు వైసీపీ లోకి వచ్చారు.. ఊరికే రారు మహానుభావులు అన్నట్లు వచ్చిన వాళ్ళు ఏదో ఒక పదవి కోసమే వచ్చారు అనేది పచ్చి నిజం..ఇక మోహన్ బాబు విషయానికి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా కాకపోయినా రాయలసీమ లోని చిత్తూరు, తిరుపతి వంటి ప్రాంతాల్లో ప్రభావితం చేయగలిగిన సత్తా వున్నా వాడే, అందుకే అతని సేవలు పార్టీ కి అవసరం అని జగన్ తీసుకొనివచ్చాడు. టీడీపీ కి నారాయణ విద్య సంస్థలు యజమాని అండదండలు వున్నాయి, కానీ వైసీపీ అలాంటి నేపథ్యం వున్నా నాయకులూ లేరు. నారాయణ సంస్థలు రేంజు కాకపోయినా తిరుపతి సైడ్ విద్యానికేతన్ సంస్థలకి మంచి పేరు ఉంది.. దానికి తోడు మోహన్ బాబు కావచ్చు, విష్ణు కావచ్చు, మనోజ్ కావచ్చు లక్ష్మి ప్రసన్న కావచ్చు, వీళ్ళందరూ పబ్లిక్ లో కొంచం క్రేజ్ ఉన్నవాళ్లే, వాళ్ళు ప్రచారానికి వస్తే మంచి బజ్ వస్తుంది, వీటిని దృష్టిలో పెట్టుకొని జగన్ కోరిక మేరకు మోహన్ బాబు వైసీపీ లోకి వచ్చాడు. దీని వలన పార్టీ అధికారంలోకి వచ్చి జగన్ ముఖ్యమంత్రి అయితే రాజ్యసభ ద్వారా మోహన్ బాబుని ఢిల్లీకి పంపాలనే ఆలోచనలో జగన్ ఉన్నట్లు, దాదాపు ఇద్దరి మధ్య ఒప్పందం అదే జరిగినట్లు తెలుస్తుంది. గతంలో ఒక్కసారి ఢిల్లీలో అధికారం చేసిన అనుభవం మోహన్ బాబు సొంతం బహుశా దాని వాసన ఇంకా మోహన్ బాబు మర్చిపోయినట్లు లేదు అందుకే మరో సరి ఢిల్లీ అధికార రుచి చూడటం కోసం వైసీపీ లో చేరిపోయాడని అనుకోవచ్చు మన కలెక్షన్ కింగ్..

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *