POLITICAL NEWS

వంగవీటి రాధ..రాజకీయం రాదా..?

తండ్రి పేరు ఇంకెన్నాళ్లు ఒక వ్యక్తి సమాజనికి దూరమై 30 ఏళ్ల అవుతున్న కానీ అతని పేరు ఇప్పటికి రాజకీయ ఓటు బ్యాంకు గా చలామణి అవుతుంది అంటే ఆ వ్యక్తి యొక్క సత్తా ఏమిటో, ఆ పేరుకి వున్నా పవర్ ఏమిటో అర్ధం చేసుకోండి.. విజయవాడ మొత్తానికే కాకుండా ఆంధ్ర రాష్ట్రము మొత్తం తెలిసిన ఆ వ్యక్తి పేరు వంగవీటి మోహన్ రంగ..అందరూ ముద్దుగా రంగ అని పిలుచుకుంటారు.. ఆ పేరు వింటే కొందరికి కరుడుగట్టిన రౌడీ గుర్తుకువస్తాడు..మరి కొందరికి దేవుడు గుర్తుకువస్తాడు.. ఇప్పటికి అయన పేరు చెప్పుకొనే అయన తనయుడు వంగవీటి రాధ తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నాడు. తప్ప అతనికంటూ ఒక సరైన గుర్తింపు అనేది లేదు.. ఇప్పటికి ఆయనకి రాజకీయంగా భవిషత్తు అనేది ఉందంటే అది వాళ్ళ నాన్నగారి చలువే అని చెప్పాలి.. బెజవాడ లో కొన్ని చోట్ల వినిపించే మాటలు ఏమిటంటే రంగ రాజకీయ పరువును రాధ మంటగలుపుతున్నాడు అని ..

 

 

ఎందుకంటే రాధ ఇప్పటివరకు రాజకీయ స్థిరత్వం అనేది సాదించుకోలేకపోయాడు.. ఏ ఒక్క పార్టీలో నిలకడ అనేది లేకపోవటం వలన అతని మీద అభిమానుల్లో కొందరి నాయకుల్లో నమ్మకం అనేది సడలిపోతుంది.. తాజాగా వైస్సార్సీపీ పార్టీ నుండి కూడా పక్కకి తప్పుకొని మరో పార్టీ గడప తొక్కటానికి సిద్ధంగా వున్నారు. అది తెలుగుదేశం గడప కావచ్చు. లేదా జనసేన గడప కావచ్చు.. ఒక్కప్పుడు బెజవాడలో వంగవీటి పేరు చెపితే దానికి వున్నా క్రేజ్ వేరు, కానీ ప్రస్తుతం ఆ పేరుకి వున్నా పవర్ తగ్గిపోయింది. మొన్న ఈ మధ్య వైస్సార్సీపీ లోని ఒక నాయకుడు రాధా గురించి మాట్లాడుతూ వాడేంత బచ్చాగాడు అంటూ మీడియా ముఖంగా చెప్పాడు అంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.. కొన్ని సమీకరణాలు దృష్ట్యా ఈ సరి అసెంబ్లీకి కాకుండా పార్లమెంట్ కి పోటీచేయమని వైస్సార్సీపీ చెప్పటం అది నచ్చక రాధా బయటకు రావటం జరిగింది.. ఒక్కప్పుడు వంగవీటి ఫ్యామిలీ పార్టీకి దూరం అవుతున్నారు అంటే అయ్యాయో పార్టీకి తీరని నష్టం అనేవాళ్ళు, కానీ ఇప్పుడు హా పోయారా..సరే పోయేవాళ్ళని ఎవరు మాత్రం ఆపగలరు అంటూ దీర్ఘాలు తీస్తున్నారు.. ఇక వైస్సార్సీపీ నుండి బయటకు వచ్చిన రాధా తో tdp మంత్రి ఒకరు మంతనాలు జరిపినట్లు సమాచారం ..కాకపోతే రాధ కి జనసేనతో కలిసి ముందుకి నడవాలని ఉన్నట్లు తెలుస్తుంది. గతంలో ప్రజారాజ్యం పార్టీలో చేరాడు. కానీ రాధా వలన పెద్దగా పార్టీకి వరిగింది కూడా ఏమి లేదనే మాటలు వినిపిస్తున్నాయి.

 

 

కాబట్టి అయన రాక జనసేనకు పెద్దగా లాభం చేకూర్చే విధంగా లేదని కొందరు వాదన ..అందులో నిజం కూడా లేకపోలేదు ..దానికి కారణం రాధా చేసే అతి ..బెజవాడకి నేనే కింగ్ అంటూ మాటలు చెప్పుకోవటం తప్ప అంతకు మించి లేదు అనేది అందరికి తెలిసిపోయింది. దీనితో అయన క్రేజ్ తగ్గిపోదు వచ్చింది. మొన్నటిదాకా వైస్సార్సీపీ లో ఉండగా కొంచం బాగానే వుంది. అప్పటిలో రాధా ని బచ్చాగాడు అని తిట్టినా నాయకుడిని జగన్ పార్టీ నుండి బయటకు పంపాడు అంటే రాధకి అక్కడ వున్నా విలువ ఏంటో అర్ధం చేసుకోండి. కాకపోతే మళ్ళి ఆ నాయకుడు పార్టీలోకి వచ్చాడు అనుకోండి..అది వేరే విషయం.. ఇక ఫైనల్ ఇప్పుడు రాధా తీసుకునే స్టెప్ అతని రాజకీయ జీవితానికి ఎంత వరకు హెల్ప్ అవుతుందో, ఇప్పుడు చేరబోయే పార్టీలో ఎన్ని రోజులు ఉంటాడో చూడాలి

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *