POLITICAL NEWS

నువ్వు కూడా ఇలాంటి మోసం చేస్తావని అనుకోలేదు…అది కాదు జగన్ భయ్యా

ప్రస్తుతం ఎక్కడ చుసిన కానీ, ప్రశాంత్ కిషోర్ గురించే చర్చ నడుస్తుంది. నిన్న మొన్నటి దాక, వైస్సార్సీపీ అధికారంలోకి రావటానికి పనిచేసి, చివరికి జగన్ ముఖ్యమంత్రి కావటంలో తనదైన పాత్ర పోషించిన పీకే గురించి యావత్తు దేశం కూడా మాట్లాడుకుంది. మీడియా మేనేజిమెంట్ లో ఆరితేరిన చంద్రబాబు నాయుడు వంటి వారికే ఎదురునిలిచి, మీడియా మేనేజిమెంట్ లోనే కాకుండా ఇటు పోల్ మేనేజ్మెంట్ లో కూడా బాబుకి చుక్కలు చూపించి వైసీపీ కి విజయం సాధించిపెట్టిన ప్రశాంత్ కిషోర్, జగన్ గెలిచి సరిగ్గా నెల రోజులు కూడా కాలేదు అప్పుడే, అతనికి వ్యతిరేకంగా పనిచేయటానికి సిద్ధం అయ్యాడనే వార్తలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.

2024 ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ తరుపున పనిచేయటానికి పీకే అగ్రిమెంట్ చేసుకుంటున్నాడనే న్యూస్ పెద్ద ఎత్తున వినిపిస్తుంది. దీనితో వైస్సార్సీపీ నాయకులకు బాగా బెంగ పట్టుకుంది. అంతే కాకుండా సోషల్ మీడియా వేదికగా పీకే మీద తమ అసహనం వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ఈ విషయం సీఎం జగన్ కి తెలియటంతో అయన డైరెక్ట్ గా ప్రశాంత్ కిషోర్ కి ఫోన్ చేసి అసలు ఏమి జరిగిందని అడిగినట్లు తెలుస్తుంది. దానికి పీకే డైరెక్ట్ గా సమాధానం చెప్పకుండా కొంచం దాటవేసే ధోరణిలో చెప్పినట్లు తెలుస్తుంది. ఇక పీకే నుండి అలాంటి సమాధానం రావటంతో, లోపల ఎదో జరుగుతుందని భావించిన జగన్. కొంచం సీరియస్ స్వరంతో మాట్లాడుతూ, మరి మీరు ఇలా మోసం చేస్తారని అసలు అనుకోలేదు.

ఇలాంటి నిర్ణయం తీసుకునే ముందు నాకు ఒక్క మాట చెప్పిన బాగుండేది అంటూ మాట్లాడటంతో, పీకే మాట్లడుతూ అదేమీ లేదు జగన్ భయ్యా.. జస్ట్ ఒక ప్రపోజల్ మాత్రమే వచ్చినట్లు మా టీం వాళ్ళు చెప్పారు. దానిపై ఇంకా ఎలాంటి నిర్ణయం నేను తీసుకోలేదని జగన్ కి చెప్పినట్లు తెలుస్తుంది. కానీ పీకే వివరణపై జగన్ సంతృప్తి కాలేదని తెలుస్తుంది..మరి మున్ముందు ఇంకా ఎన్ని జరుగుతాయో చూడాలి.


Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *