POLITICAL NEWS

జనసేన లో చేరనున్న మెగా బ్రదర్…

తెలంగాణాలో ఎన్నికలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా  ముగిసాయి..ఇప్పుడు ఆంధ్ర లో ఎలెక్షన్ల హావ చెలరేగుతోంది..ఆంధ్ర ఎలక్షన్స్ కి ఇంకా సమయం ఉంది..దాదాపు వేసవికాలంలో జరిగే ఎలక్షన్స్ కోసం ఇప్పటినుండి పార్టీ లు తమ నివేదిక ని తయారు చేసుకుంటున్నాయి.అందులో ఇప్పుడు మంచి వేడి మీద ఉన్న పార్టీ మన జనసేన..పవన్ కళ్యాణ్ పార్టీ అధినేతగా నడుస్తుంది…ఎన్నికల ముందు నుండి పవన్ కళ్యాణ్ చాల ఎక్కువ శ్రద్ధ తో ఎలాగైనా గెలవాలన్న కసితో పార్టీ ని మంచి నియమావళితో నడిపిస్తున్నాడు..పార్టీ కి  ఇప్పటినుండే విరాళాల్ని అందిస్తున్నారు..ఇంత త్వరగా ఎవరు విరాళం ఇచ్చారు అంటే ఎవరూ కాదు మన మెగా బాబు నాగ బాబు అంట..అయన దాదాపుగా ఒక పాతిక లక్షలు ఇచ్చాడు నాగబాబు. అంతేకాదు కొడుకు వరుణ్ తేజ్  కోటి రూపాయలు విరాళం ఇప్పించాడు. మొత్తంగా కేవలం నాగబాబు ఫ్యామిలీయే దాదాపు కోటిన్నర విరాళం జనసేనకు ఇచ్చింది. పార్టీ బలోపేతం కోసం పవన్ కల్యాణ్ విరాళాలు సేకరిస్తున్నాడు. ఇంత పెద్ద మొత్తాన్ని ఒకేసారి నాగబాబు  ఇవ్వడం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

 

 

అయితే ఇందులో పెద్ద ఆశ్చర్యం ఏం లేదని.. నాగబాబు పవన్ కల్యాణ్ రుణం తీర్చుకున్నాడని అనే మాటలు వినిపిస్తున్నాయి.అన్న తమ్ముని ఋణం తీర్చుకోవడం ఏంటి అనుకుంటున్నారా.దానికొక కథ ఉంది..అదేంటంటే ..నాగబాబు సొంతంగా ఒక సినిమా ని నిర్మించాడు..అదే ఆరెంజ్…కానీ ఆ సినిమా భారీగా ఫ్లాప్ ని అందుకుంది..కాబట్టిఆరంజ్ సినిమా ఫ్లాప్ తో నాగబాబు తన ఆస్తులన్నీ పోగొట్టుకున్నాడు. దాదాపుగా ఆరంజ్ సినిమాతో రోడ్డుమీదకు వచ్చేశాడు. ఆ సమయంలో.. నా అనుకున్న వాళ్లు ఎవ్వరూ నాగబాబుకు సాయం చేయలేదు. అలాంటి టైమ్ లో తన అన్నకోసం పవన్ కల్యాణ్ రంగంలోకి దిగాడు. చాలా వరకు ఆస్తులు అమ్మి నాగబాబు అప్పుల్ని తీర్చాడు. అయితే… కానీ ఈ విషయం అధికారికంగా బయటకు రాకపోయినా.. ఎక్కువ మంది ఇండస్ట్రీలో ఈ మాట  నిజమనే చెప్తారు. అందుకే  కృతజ్ఞతగా.. ఇప్పుడు తనవంతు సాయం నాగబాబు ఫ్యామిలీ చేసిందని చెప్తున్నారు. కానీ మరోవైపు.. ఇంకొన్ని రోజుల్లో నాగబాబు జనసేనలో చేరడం ఖాయమని అనేవాళ్లు లేకపోలేదు. మరి నాగబాబు జనసేనలో చేరతారో.. లేదంటే బయటనుంచి మద్దతు ఇస్తారో తెలియాలంటే ఎన్నికల వరకు ఆగాల్సిందే.

 

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *