POLITICAL NEWS

మోడీని టార్గెట్ చేసిన బోయపాటి

అదేంటి సినిమా దర్శకుడు అయినా బోయపాటి ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ ని ఎందుకు టార్గెట్ చేసుకున్నాడు, దాని వలన బోయపాటికి ఏంటి లాభం అని అనుకుంటున్నారా..? అక్కడికే వస్తున్నాము.. వినయ విధేయ రామ సినిమా తర్వాత బోయపాటి బాలయ్య బాబుతో సినిమా అనుకున్నారు అది ఎన్నికల తర్వాతకి పోస్ట్ ఫోన్ అయ్యింది. ఈ గ్యాప్ ని అయన తెలుగుదేశం కోసం వినియోగిస్తున్నారు.. పార్టీ తరుపున వివిధ రకాలైన యాడ్స్ చేస్తూ టీడీపీ కి సేవ చేస్తున్నాడు. గోదావరి పుష్కరాలు కావచ్చు, కృష్ణ పుష్కరాలు కావచ్చు ఏమైనా సరే బోయపాటి తన మార్క్ చూపిస్తూ చంద్రన్న దగ్గర మార్కులు సంపాదించాడు. దీనితో ఈ సరి ఎన్నికల యాడ్స్ బాధ్యత బోయపాటికి అప్పగించారు. అందుకు తగ్గట్లే సూపర్ అనేలా యాడ్స్ తయారుచేసాడు బోయపాటి. కంటెంట్ కావచ్చు, క్వాలిటీ కావచ్చు, డబ్బింగ్ కావచ్చు, తనదైన ఎమోషన్స్ కావచ్చు అన్నింటీని మిక్స్ చేసి అదిరిపోయే రేంజులో యాడ్స్ చేసాడు. అవి ఇప్పుడు ఏ టీవీ ఆన్ చేసిన వస్తూ హల చల్ చేస్తున్నాయి. ఈ యాడ్స్ విషయంలో టీడీపీ ఒక మెట్టు పైనే వుంది అంటే అది కచ్చితంగా బోయపాటి వలెనే అని చెప్పాలి. ఇప్పటిదాకా సంక్షేమ పథకాలు,అభివృద్ధి అంటూ యాడ్స్ చేసిన బోయపాటి ఇక నుండి ఆంధ్ర సెంటిమెంట్ రెచ్చకొట్టేలా ఏకంగా మోడీని టార్గెట్ చేస్తూ యాడ్స్ చేస్తున్నాడని సమాచారం. మోడీ వలన ఆంధ్ర ప్రజలు ఎంత నష్టపోయారో చెపుతూ పవర్ ఫుల్ యాడ్స్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. వీటిని సరిగ్గా పోలింగ్ కి నాలుగైదు రోజుల ముందు టెలికాస్ట్ చేయటానికి రంగం సిద్ధం చేస్తున్నారు.. ఆ వీడియోస్ కచ్చితంగా ఆంధ్ర ప్రాంత ప్రజలమీద బలమైన ప్రభావం చుపిస్తాయనో నమ్మకంతో వున్నారు. ఇప్పటికే చేసిన యాడ్స్ కి అద్భుతమైన స్పందన వస్తుంది.. దానికి తోడు అన్ని ఛానల్ లో దాదాపు ఈ యాడ్స్ ప్రతి అరగంటకి ప్రచారం అయ్యేలా పక్క ఒప్పందం చేసుకున్నారు టీడీపీ వాళ్ళు.. అలాగే సోషల్ మీడియాలో కూడా విస్తృతమైన ప్రచారం చేస్తూ ముందుకి పోతున్నారు. విజయం కోసం వున్నా ఆ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోకుండా 2019 లో అధికార పీఠమే లక్ష్యంగా సాగుతున్న వారికీ ఈ యాడ్స్ ఎంత వరకు హెల్ప్ అవుతాయో చూడాలి..

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *