MOVIE

పునర్నవి అంటే నాకు కాలుతుంది..తప్పక భరిస్తున్న…వితిక రాహుల్ నిజ స్వరూపం బయటపడింది

బిగ్ బాస్ హౌస్ లో వితిక- పునర్నవి మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అని అందరికి తెలుసు. హౌస్ లోకి వచ్చిన మొదటి నుండి ఇద్దరు కూడా బాగా కలిసిపోయారు, వాళ్ళకి తోడు వరుణ్ సందేశ్, రాహుల్ కలిశారు. అందరు కలిసి హౌస్ లో ఒక గ్రూప్ గా ఏర్పడ్డారు. ప్రతి విషయంలో కూడా వాళ్ళు నలుగురే కలిసి చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారు. అలాంటిది వాళ్ళ మధ్య ఇప్పుడు చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నట్లు తెలుస్తుంది. బెడ్ రూమ్ ఏరియా లో వితిక రాహుల్ తో మాట్లాడుతూ పునర్నవి అంటే నాకు కాలిపోతుంది. కిచెన్ లోకి వెళ్ళగానే దానికి ఒక అధారిటీ వచ్చేస్తుంది. అన్ని ఆమెకి నచ్చినట్లే చేయాలనీ అనుకుంటుంది. కిచెన్ లో ఏమి చేస్తున్న, అది ఎందుకు, ఇది ఎందుకు..ఆలా ఎందుకు చేశావు.. ఇలా ఎందుకు చేశావు అంటూ నస పెడుతుంది. ఉదయం కిచెన్ లో వరుణ్ కడుగుతుంటే నేను ఎదో చెపుతున్న, దానికి వరుణ్ నాతో మాట్లాడుతున్నాడు.

అప్పుడు ఆమెకి ఏమి అయ్యిందో ఏమో ఇలా అయితే నేను కిచెన్ నుండి వెళ్ళిపోతాను అంటూ మాట్లాడండి. అది అసలు నాకు నచ్చలేదంటూ రాహుల్ కి చెపుతుంది. ఇవన్నీ గమనిస్తే వాళ్ళ మధ్య కూడా పెద్ద స్థాయిలోనే విభేదాలు ఉన్నట్లు తెలుస్తుంది . కాకపోతే బయట పడకుండా లోపలలోపలే మాట్లాడుకుంటున్నారు. అయితే ఇవి ఎక్కువ రోజులు దాచలేరు. రేపో మాపో వాళ్ళ మధ్య గొడవలు జరగటం ఖాయం. అయిన ఒక టీం గా, మంచి క్లోజ్ గా ఉన్నప్పుడు డైరెక్ట్ గా ఆలా కాదే, ఇలా అంటూ తప్పు ఉంటే చెప్పాలి కానీ, ఆమె లేనప్పుడు మరొకరితో ఆ తప్పులను ఎత్తి చూపిస్తూ మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు, అది నమ్మకద్రోహం కిందకే వస్తుంది.

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *