MOVIE

అసలు బిగ్ బాస్ ను చూసే జనాలకు బుద్ది లేదు..నా క్యారెక్టర్ నే తప్పు బడతారా :తమన్నా సింహాద్రి

ప్రస్తుతం బిగ్ బాస్ షో అనేది తెలుగు రెండు రాష్ట్రాలలో కూడా బాగా ఫేమస్ అయ్యింది కంటెస్టెంట్ల మధ్య రోజుకో రకంగా తీవ్రమైన వాదనలు,ఏడుపులు ఒక్కోసారి బిగ్ బాస్ కూడా వారి మధ్య చిచ్చు పెట్టి మరీ వాళ్ళను తిట్టేలాగా చేస్తున్నాడు.అయితే బిగ్ బాస్ స్టార్ట్ అయినా మొదటి వారంలోనే హౌస్ నుండి హేమ ఎలిమినేట్ కాగా వైల్డ్ కార్డు ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది ట్రాన్స్ జెండర్ తమన్నా సింహాద్రి. అయితే తాను ఎప్పుడైతే హౌస్ లోకి అడుగుపెట్టిందో అప్పటినుంచి వరుణ్,వితికాలను టార్గెట్ చేస్తూ వచ్చింది.ఇక మహేష్ కి మద్దతుగా నిలిచింది.ఇక సీరియల్ యాక్టర్ అయినా రవిక్రిష్ణను కూడా పండు పండు అంటూ ముద్దుగా పిలుస్తూ వచ్చిన ఆమెకు మూడవ వారంలోనే బిగ్ షాక్ ఇచ్చాడు రవికృష్ణ. అదేనండి అతను ఎలిమినేషన్ ప్రక్రియలో తమన్నాను నేరుగా నామినేట్ చేసాడు.

ఇక అప్పటినుండి తమన్నా అతనికి టార్చర్ అంటే ఎలా ఉంటాడో చూపిస్తాను,నేను వెళ్లేసరికి వాడికి నేనంటే ఏమిటో తెలిసేలా చేసి చుక్కలు చూపిస్తా నంటూ శపధం చేసింది తమన్నా ఆమె అనుకున్నట్లుగానే అతనిని టార్చెర్ పెట్టడంతో ప్రేక్షకులలో కానీ ఇటు హౌస్ మేట్స్ కి కూడా ఆమెపై చాలా కోపం పెంచుకున్నారు . ఇక కొంతమందిఅతె ఆమె హౌస్ నుండి వెళ్లిపోవడమే బెటర్ అనే ఫీలింగ్ ను వాళ్లలో కల్పించారు తమన్నా . ఇక మొన్న ఆదివారం హౌస్ నుండి ఎలిమినేట్ అయినా తమన్నా సింహాద్రి తాజాగా బిగ్ బాస్ గురించి,మరియు హౌస్ మేట్స్ గురించి కూడా కొన్ని సంచలన కామెంట్స్ చేశారు. షో నుండి ఎలిమినేట్ అయిన తమన్నాతో ఒక ప్రైవేట్ మీడియా వారు ఇంటర్వ్యూ నిర్వహించారు. కాగా ఈ ఇంటర్వ్యూ లో పాల్గొన్న తమన్నా మాట్లాడుతూ… ఈ బిగ్ బాస్ ఇంట్లో ఉన్నన్ని రోజులు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశానని, కానీ తానూ ఎలిమినేట్ కావడానికి కారణం ప్రజలందరూ కూడా తనని తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పుకొచ్చింది. కాగా బిగ్ బాస్ అనేది ఒక గేమ్ షో. ఈ షో లోకి వచ్చిన వారందరు కూడా గేమ్ ఆడటానికి మాత్రమే వస్తారని, తాను కూడా అదే ఉద్దేశంతో ఇంటి లోపలికి వెళ్లానని స్పష్టం చేశారు. అయితే రవికృష్ణ విషయంలో తన ప్రవర్తన కేవలం ఆటలో భాగమేనని, కానీ ఆ విషయంలోనే ప్రజలందరూ కూడా తనని తప్పుగా అర్థం చేసుకోవడంతో పాటు, తన క్యారెక్టర్ ని తప్పుబట్టారని చెప్పారు. కేవలం ఒక ఆటలోఅలా ప్రవర్తించినంత మాత్రాన తాను చెడ్డదాన్ని అయిపోతానా అని తమన్నా ప్రశ్నించారు. “బిగ్ బాస్ చూసే ప్రేక్షకులకు నిజంగా జ్ఞానం ఉందొ లేదో నాకైతే అర్ధం కావడం లేదు.. ” నేను కేవలం ఆటలో భాగంగానే అతనిని అలా బాధపెట్టనే తప్ప నా మనస్సాక్షిగా అయితే ఆ మాటలు రాలేదు ఎందుకంటే అతను చాల మంచి బాయ్ టాలెంటెడ్ పర్సన్ నేను ఇప్పటికి కూడా కోరుకునేది ఒక్కటే అతను బిగ్ బాస్ టైటిల్ గెలవాలని కోరుకుంటున్నాను అంటూ మీడియా ముందు చెప్పుకొచ్చారు తమన్నా.

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *