MOVIE

రోహిణిని దారుణంగా అవమానించిన శ్రీముఖి…

బిగ్ బాస్ హౌస్ లో ఈ వారం ఎలిమినేషన్ లో ఎవరు వెళ్ళిపోతారు అనే భయం నామినేట్ అయిన ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది. హౌస్ లో కూడా ఎలిమినేట్ గురించి చర్చలు జరుగుతున్నాయి. ఎవరి వెర్షన్ లో వాళ్ళు అనాలసిస్ చేసుకుంటున్నారు. తాజాగా హౌస్ లో ఎలిమినేషన్ గురించి శ్రీముఖి మాట్లాడుతూ రోహిణి ఈ వీక్ నువ్వు ఎలిమినేట్ అయ్యేలా ఉన్నావు అంటూ చెప్పింది. దీనితో రోహిణి బాగా సీరియస్ అయ్యింది. నేను అవుతాను అని నువ్వు ఎలా జడ్జి చేస్తావు అంటూ మాట్లాడింది.రెండు వారాల నుండి నా వ్యూ లో నేను అనాలిసిస్ చేస్తున్న ఆలా చూసుకుంటే బాబా భాస్కర్, శివజ్యోతి వాళ్ళు స్ట్రాంగ్ గా ఉన్నారు.

నువ్వు కొంచం వీక్ గా ఉన్నట్లు అనిపించింది అందుకే నువ్వు ఎలిమినేట్ అవుతావేమో అని చెప్పను అంటూ శ్రీముఖి బదులించింది. ఆలా అనిపిస్తే డైరెక్ట్ గా మొఖం మీదే నువ్వు వెళ్ళిపోతావు అని చెపితే బాధగా అనిపించదా..? నేను టాస్క్ లు బాగానే ఆడుతున్న కానీ, హౌస్ లో బాగానే ఉంటున్న కదా, అయిన నువ్వు వెళ్ళిపోతావు అంటే ఎలా ఉంటుంది నాకు అంటూ ఏడుస్తూ బెడ్ రూమ్ ఏరియా లోకి వెళ్ళింది.ఇక రోహిణి అలా వెళ్లేసరికి శివజ్యోతి, అషు రెడ్డి, వితిక, పునర్నవి అందరు వెళ్లి రోహిణిని ఓదార్చే పనిలో పడ్డారు. ఈ క్రమంలో పునర్నవి రోహిణికి సపోర్ట్ గా మాట్లాడుతూ శ్రీముఖి గురించి తప్పుగా చెప్పటానికి ట్రై చేస్తుంది. ఇవన్నీ గమనించిన శ్రీముఖి “కేవలం ఈ విషయం రోహిణికి నాకు మద్యే జరిగింది. మాకు మేము మాట్లాడుకొని క్లియర్ చేసుకుంటాం మూడో వ్యక్తి మధ్యలో వద్దు” అంటూ గట్టిగా చెప్పింది. దీనితో పునర్నవి సైలెంట్ అయిపోయింది. అ తర్వాత ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని దానిని క్లియర్ చేసుకున్నారు.

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *