MOVIE

బిగ్ బాస్ కి పులిహోర రాజాలే కావాలి.. శ్రీముఖి సంచలనమైన వ్యాఖ్యలు

బిగ్ బాస్ హౌస్ రాహుల్ కి పులిహోర రాజా అనే పేరు పడిపోయింది. పునర్నవి విషయంలో రాహుల్ బిహేవియర్ చూసిన వాళ్ళకి అలాగే అనిపిస్తుంది. గత వారం స్పెషల్ గెస్ట్ గా వచ్చిన వెన్నెల కిషోర్ కూడా రాహుల్ గురించి మాట్లాడూతూ నీ గురించి బయట మంచి టాక్ వస్తుంది. మంచి పులిహోర రెసిపీ అంటున్నారు అంటూ చెప్పాడు. ఇన్ని జరుగుతున్నా కానీ రాహుల్ మాత్రం పునర్నవి తో పులిహోర కలిపే పని మాత్రం ఆపటం లేదు. తాజాగా దీనిపై హౌస్ శ్రీముఖి స్పదించింది. ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి ఎవరు బయటకు వెళ్ళిపోతారు అనే దాని గురించి శ్రీముఖి, హిమజ, రవికృష్ణ ముగ్గురు మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలో శ్రీముఖి మాట్లాడుతూ రాహుల్ హౌస్ నుండి అప్పుడో బయటకు వెళ్ళాడు. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ లోకి పులిహోర రాజాలే కావాలి.

హౌస్ లో వాళ్ళతోనే కావాల్సిన ఫుటేజీ వస్తుందని కాబట్టి రాహుల్ హౌస్ నుండి ఇప్పుడే బయటకుపొడు. అతను హౌస్ నుండి వెళ్లాలని నేను గట్టిగానే కోరుకుంటున్న, ఇదే విషయాన్నీ రాహుల్ కి డైరెక్ట్ గానే చెప్పానంటూ శ్రీముఖి చెపుతుంది. అలాగే గత సీజన్ లో చూస్తే కూడా అలాంటి వాళ్లనే బిగ్ బాస్ హౌస్ ఉంచుతాడు, దాని ప్రకారం నా అనాలసిస్ ప్రకారం ఈ  రాహుల్ ఉంటాడు అంటూ రవికృష్ణకి, హిమజకి చెపుతుంది. దీనితో హిమజ మాట్లాడుతూ శ్రీముఖి నీ అనాలసిస్ సూపర్ గా ఉంటుంది. మొదటి నుండి వింటూనే విన్నాను, హౌస్ మేట్స్ గురించి, టాస్క్ ల గురించి బాగా అనాలిసిస్ చేస్తావు అంటూ శ్రీముఖిని పొగడటం స్టార్ట్ చేసింది.

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *