MOVIE

మాయమాటలతో గేమ్ ఆడుతున్న శ్రీముఖి బండారం బట్ట బయలైంది..మరి ఇంత దారుణమా రాములమ్మ

బిగ్ బాస్ హౌస్ లో ప్రతి ఒక్కరు గేమ్ ఆడటానికే వచ్చారు. ఎవరి స్టైల్ లో వాళ్ళు గేమ్ ఆడుతున్నారు. అయితే అంతిమంగా నిజాయితీగా గేమ్ ఆడిన వాళ్ళనే ప్రేక్షకులు గుర్తిస్తారు. గేమ్ ఆడే ప్రాసెస్ లో కొన్ని కొన్ని సార్లు అవుట్ అఫ్ బౌండరీస్ క్రాస్ చేయవలసి ఉంటుంది.  అలాగే హౌస్ లో ఎవరు ఎవరితో ఎలా ఉంటున్నారో ఏమేమి మాటలు చెపుతున్నారో ప్రేక్షకులు ఇట్టే గమనిస్తారు. ముఖ్యంగా శ్రీముఖి మాత్రం డబల్ గేమ్ చాలా చక్కగా ఆడుతుంది. ఎవరి దగ్గర వాళ్ళకి చెప్పే మాటలు చెపుతూ హౌస్ లో కాలం గడుపుతుంది. నిన్న బాబా భాస్కర్ తో మాట్లాడే సమయంలో మహేష్ గురించి చాలా విషయాలు చెప్పింది. అతన్ని నమ్మకండి మిమ్మల్ని మోసం చేస్తాడు అంటూ చెప్పింది. అలాగే అలీతో జరిగిన గొడవ గురించి కూడా బాబాతో మాట్లాడింది.

అది అయినా తర్వాత అలీ శ్రీముఖి మహేష్ శివజ్యోతి మాట్లాడుకుంటున్న సమయంలో నేను వెళ్లి బాబాతో మాట్లాడి ఉంటే బాగుండేది అంటూ శ్రీముఖితో అలీ అనేసరికి, నేను నాకు సంబంధించిన ఒక ఇష్యూ ఉంటే వెళ్లి మాట్లాడి క్లియర్ చేసుకున్న, నువ్వు వెళ్లి మాట్లాడాలి అనుకుంటే వెళ్లి మాట్లాడు అంటూ శ్రీముఖి చెప్పింది, కానీ అక్కడ శ్రీముఖి వెళ్ళింది తన పనికోసం కాదు. బాబాకి ఎదో మంచి చేస్తున్నానంటూ చెప్పి, కష్ట సమయంలో నేను నీకు సపోర్ట్ గా వుంటాను అని బాబాకి తెలపటానికే వెళ్ళింది. నిజానికి ఆ సమయంలో అలీ వెళ్లి మాట్లాడితే సమస్య అయిపోయేది, కానీ శ్రీముఖి వెళ్లి దానిని కొంచం పైకి లేపి వచ్చినట్లు అయ్యింది. అలాగే మహేష్ లేనప్పుడు అతని గురించి తప్పుగా మాట్లాడటం, మహేష్ రాగానే హే అంటూ కలిసిపోవడం లాంటి డబల్ గేమ్ బాగానే ఆడుతుంది శ్రీముఖి.

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *