MOVIE

ఛీ..ఛీ శ్రీముఖి..ఇదేమి పాడు బుద్ధి..దొంగచాటు వ్యవహారాలు

బిగ్ బాస్ హౌస్ లో ఈ సీజన్ లో స్ట్రాంగ్ కాంటిస్టెండ్స్ లో శ్రీముఖి ఒకరు. ఆమెకి బయట వున్న ఫాలోయింగ్ కావచ్చు, ఆమె హౌస్ లో వుండే విధానం కావచ్చు దాని వలన శ్రీముఖికి మంచి ఫ్యాన్స్ ఉన్నారు. హౌస్ లోకి వచ్చిన మొదటి నుండి ఆమె టైటిల్ రేస్ లో ముందే ఉంటుంది, చిన్న చిన్న ఇష్యూస్ జరిగిన కానీ ఆమెకి ఆడియన్స్ నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. అయితే గత కొన్ని రోజుల నుండి శ్రీముఖి మాటల్లో కొంచం డిఫరెంట్ కనిపిస్తూనే ఉంది. హౌస్ లో గ్రూప్స్ ఏర్పడటానికి శ్రీముఖి కారణమనే వాదనలు బలంగా వినవస్తున్నాయి. తాజాగా అలీ, హిమజ విషయంలో శ్రీముఖి మాటలు వింటే అసలు శ్రీముఖి ఇలా కూడా మాట్లాడుతుందా అనిపిస్తుంది. ఎందుకంటే హిమజ,అలీ గొడవ జరిగినప్పుడు శ్రీముఖి అక్కడే ఉంది, తప్ప దానిలో ఇన్వాల్ కాలేదు. ఎలాంటి స్టాండ్ తీసుకోకుండా సైలెంట్ గా చేస్తూ ఉంది.

తీరా నిన్న నాగార్జున ఆ విషయంలో ఆలీకి వార్నింగ్ ఇచ్చేసరికి హౌస్ మేట్స్ చాలా మంది హిమజకి మద్దతు పలుగుతున్నారు . శ్రీముఖి అయితే దాని గురించి బాబా భాస్కర్, హిమజాలతో మాట్లాడుతూ ఆ గొడవ జరిగే సమయంలో సాంగ్ వస్తుంది, నాకేమి సరిగ్గా అర్ధం కాలేదు. ఆ తర్వాత చుస్తే నిన్ను చెంప కేసి కొడుతూ అంటూ మూడు నాలుగు సార్లు అలీ హిమజాని అంటున్నాడు అంటూ చెప్పింది. సరే అలీ అలాగే అన్నాడు, మరి ఆ సమయంలో హిమజ వైపు స్టాండ్ తీసుకోని అలీ నీది తప్పు అని చెప్పవచ్చుగా ఆలా చేయకుండా ఇప్పుడు తీరిగ్గా నాగ్ మాట్లాడిన తర్వాత సానుభూతిగా మాట్లాడుతుంది. ఈ మాటలు జరిగేటప్పుడు అలీ అటు సైడ్ వస్తే గుడ్ మార్నింగ్ అలీ అంటూ పలకరించి అలీ అటు వెళ్ళగానే మళ్ళీ అలీ మీద చెప్పటం స్టార్ట్ చేసింది. ఇవి ఏమి మిగతా హౌస్ మేట్స్ కి తెలియకపోవచ్చు, కానీ ఆడియన్స్ కి తెలుస్తాయనే విషయాన్నీ శ్రీముఖి మర్చిపోయినట్లు ఉంది. ముందు శ్రీముఖి ఇలాంటి ధోరణి మార్చుకుంటే చాలా మంచిది, లేకపోతే మధ్యలో పోయే ఛాన్స్ ఉంటుంది.

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *