MOVIE

కొరియ‌న్ మూవీకి జై కొట్టిన స‌ల్మాన్ ఖాన్

 బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్  ఖాన్ ప్రస్తుతం న‌టిస్తున్న చిత్రం  భరత్  ……… అలీ అబ్బాస్ జఫార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈద్ సందర్భంగా ఈ ఏడాది జూన్ 5 న రిలీజ్ కు సిద్ధ‌మైంది .  ఈ సినిమా ‘ఓడ్ టు మై ఫాదర్’ అనే కొరియన్ సినిమాకు అధికారిక రీమేక్. ఈ క‌థ‌ను మొత్తం కాకుండా మూల క‌థ‌ను   మాత్ర‌మే తీసుకొని , ఇండియన్ ఆడియన్స్ టేస్ట్ కు తగ్గట్టు మార్పుచేర్పులు చేశారట.
                   ఇదిలా ఉంటే సల్మాన్ మరో కొరియన్ రీమేక్ చిత్రంలో నటిస్తున్నానని రీసెంట్ గా ప్ర‌క‌టించారు.ప్రస్తుతం సల్మాన్  తన సొంత బ్యానర్ లో నిర్మించిన ‘నోట్ బుక్’ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు .  ఈ చిత్రం ద్వారా జహీర్ ఇక్బాల్.. ప్రనూతన్ బహల్ ను హీరో హీరోయిన్లు గా బాలీవుడ్ కు పరిచయం చేస్తున్నారు.  ఈ ప్రమోషన్స్ లో భాగంగా తన ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు కొరియన్  సినిమా వెటరన్ ను  రీమేక్ చేస్తున్నానని చెప్పారు .
                  సల్మాన్ బావ అయిన అతుల్ అగ్నిహోత్రి ‘వెటరన్’ చిత్రం హిందీ రీమేక్ రైట్స్ తీసుకున్నాడని..  సంజయ్ లీలా భన్సాలి సినిమా పూర్తి కాగానే ఈ సినిమాను మొదలు పెడతామని తెలిపారు .  వెటరన్  ఒక యాక్షన్ కామెడీ సినిమా . భారీ క్రైమ్ సిండికేట్ ను నడిపే ఒక టాప్ బిజినెస్ మ్యాన్ గుట్టురట్టు చేయడమే ఈ సినిమా కాన్సెప్ట్. ఇదిలా ఉంటే.. ‘భరత్’ తర్వాత సల్మాన్ రెండు సినిమాలు పూర్తి చేయాల్సి ఉంది.  అందులో ‘దబాంగ్ 3’ ఒకటి కాగా సంజయ్ లీలా భన్సాలి దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘ఇన్షాఅల్లా’ మరొకటి.  ఈ చిత్రాల తర్వాతే  వెటరన్ రీమేక్ సెట్స్ పైకి వెళ్లే అవ‌కాశం ఉంది . గతంలో సల్మాన్   ఎక్కువగా  తెలుగు రీమేక్ లపై  ఆధారపడేవాడు. ఇప్పుడు రూటు మార్చి జై కొరియన్ అంటున్నారు .

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *