MOVIE

సాహో సినిమా ఫ్లాప్ కావడానికి ఈ ఐదు కారణాలే ముఖ్యమైనవి…

సాహో సినిమాపై అన్ని సినీ పరిశ్రమల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇంత భారీ అంచనాలు ఉన్న సినిమా ఈ మధ్య కాలంలో రాలేదని చెప్పవచ్చు. ఇలాంటి హైప్ అనేది సినిమాకి ఒక రకంగా ప్లస్ అయితే, మరో రకంగా మాత్రం చాలా నష్టం కలిగిస్తుందని చెప్పవచ్చు. ఇంత హైప్ వున్నప్పుడు, ఆ స్థాయిని అందుకోవడంలో సినిమా ఎక్కడైనా కొంచం తడబడిన నెగిటివ్ గా మాట్లాడుతారు. ప్రస్తుతం సాహో పరిస్థితి కూడా అలాగే ఉంది, సినిమా మొదటి షో పడిన దగ్గర నుండి సాహో మీద నెగిటివ్ టాక్ బాగా స్ప్రెడ్ అవుతుంది. నెగిటివ్ టాక్ రావటం వేరు, అదే పెద్ద స్టైయిలో స్ప్రెడ్ అవటం వేరు. ఇంత పెద్ద బడ్జెట్ సినిమా తీస్తున్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, లేకపోతె మొదటికే మోసం వస్తుంది. సాహో విషయంలో కూడా అదే జరిగింది. ఫైనల్ గా సినిమా ప్లాఫ్ అనే ముద్ర వేసుకుంది. ఈ సినిమా ప్లాఫ్ అవటానికి ఐదు ప్రధాన కారణాలు1 . బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమా కావటంతో సహజంగానే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండటం సహజం. దానికి తోడు ఇండియన్ సినిమా హిస్టరీలోనే చెప్పుకోదగిన స్థాయిలో ఈ సినిమాని చిత్రీకరించటం జరిగింది. హాలీవుడ్ స్థాయి సినిమాగా ఎక్సపోజ్ చేస్తూ వచ్చారు. దీనితో సినిమా అంచనాలు స్కైకి టచ్ అయ్యాయి. వాటిని అందుకునే క్రమంలో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి.

2 . ఈ స్టోరీ బాహుబలి కంటే ముందు ఫిక్స్ చేసిన లైన్.. బాహుబలి సూపర్ హిట్ కావటంతో సినిమా స్కెల్ పెంచి ప్యాన్ ఇండియన్ మూవీ గా మలిచే ప్రయత్నం చేశారు. దాని కోసం పెద్ద పెద్ద నటులను తీసుకున్నారు, వాళ్ళ కోసం కథలో అనవరసమైన సన్నివేశాలు, ట్విట్స్ జతచేశారు. దీనితో కథలో కొంచం క్లారిటీ మిస్ అయ్యింది, పాత్రలు ఎక్కువ అయ్యాయి, ప్రభాస్ కి తప్ప మిగిలిన నటి నటులకి తగినంత స్క్రీన్ టైమింగ్ దొరకలేదు. మంది ఎక్కువ అయితే మజ్జిగ పలచన అవుతుంది అనే సామెతగా సినిమా స్థాయి పెంచటంతో స్టోరీలో గ్రిప్ తగ్గింది.3 . ఇక ఈ సినిమాలో కేవలం మేకింగ్ మీద దృష్టి పెట్టినట్లు అనిపిస్తుంది. ఒక్కో షాట్ ని ఎలా షూట్ చేయాలి. ఎన్ని కెమెరాలు పెట్టాలి, దానికి గ్రాఫిక్స్ వర్క్ ఏమి చేయాలి, సెట్స్ ఏమేమి వేయాలి, దానికి ఎంత ఖర్చుపెట్టాలి, దాని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉండాలి అనే దానిపై దర్శకుడు సుజిత్ కి విపరీతమైన క్లారిటీ ఉన్నట్లు మనకి సినిమా చూస్తే అర్ధం అవుతుంది, కానీ అవన్నీ కూడా కథకి లోబడి నడుచుకోవాలి కానీ, కథని డామినేట్ చేసే విధంగా ఉండకూడదు. అదనపు హంగులు, యాక్షన్ సన్నివేశాల మీద పెట్టిన శ్రద్ద స్టోరీ మీద పెట్టి ఉంటే సినిమా మరో స్థాయికి వెళ్ళేది.4 . సినిమా అనేది అనేకమంది సమూహం. స్టోరీ అనేది ఎప్పుడు ఒకరి మీదే డిపెండ్ అయ్యి నడవకూడదు. ఎప్పుడు కూడా వన్ అండ్ ఓన్లీ అనే సూత్రం సరిగ్గా ఫలితాన్ని ఇవ్వదు.

చరిత్రలో గొప్పగా చెప్పుకునే  సినిమాలు అన్ని కూడా ఒక్కరి మీదే ఆధారపడి హిట్ అయినా దాఖలాలు చాలా తక్కువ.. బాహుబలి సినిమానే తీసుకుంటే అందులో బలమైన పాత్రలు ఐదారు దాక ఉన్నాయి. సినిమా బరువుని అందరు మోస్తూ విజయతీరాలకు చేర్చారు . సాహో లో ప్రభాస్ నటనకి కానీ, అతని కష్టాన్ని కానీ తక్కువ చేసి మాట్లాడలేము. కాకపోతే సినిమా బరువు మొత్తం అతను మీద వేయటం బాగాలేదు.. తన వరకు ప్రభాస్ ఎక్సర్డినరీ పర్ఫామెన్స్ ఇచ్చిన కానీ, మిగిలిన పాత్రలు తేలిపోవటంతో సినిమా కూడా తేలిపోయిన ఫీలింగ్ వస్తుంది.5 . ఒక దర్శకుడికి అనుభవం అనేది ఎంత అవసరమో ఈ సినిమా చూస్తే అర్ధం అవుతుంది. ఒకే ఒక్క సినిమా అనుభవం కలిగిన సుజిత్ కి ఇంత పెద్ద బాధ్యత అప్పచెప్పటం అనేది చాలా సాహసోపేతమైన నిర్ణయం. మేకింగ్ పరంగా మంచి ఇన్నోవేషన్స్ కలిగిన డైరెక్టర్ సుజిత్. కాకపోతే వాటిని సమతూకంలో పేర్చే విషయంలో అతను బాగా తడబడ్డాడు. అంత పెద్ద క్యాన్వాస్ కలిగిన సినిమాని డైరెక్ట్ చేయటం అంటే మాములు విషయం కాదు. మొన్న సాహో ఈవెంట్ లో ఒకరు మాట్లాడుతూ రాజమౌళికి బాహుబలి తీయటానికి పది సినిమాల అనుభవం కావలసి వచ్చిందని అన్నారు.. ఆ అనుభవం ఇప్పుడు సుజిత్ కి లేకపోవటం వలనే సాహోకి ఫైనల్ అవుట్ ఫుట్ ఇలా వచ్చిందని చెప్పవచ్చు.చివరిగా ఒక మాట..సినిమా జయాపరాజయాలు అనేవి కాసేపు పక్క పెడితే, నిజాయితీగా తెలుగు సినిమాని ప్రపంచ స్థాయికి తీసుకోని వెళ్ళటానికి కష్టపడిన సాహో చిత్ర బృందానికి అందరు హ్యాట్సాఫ్ చెప్పాలి. ఒక తెలుగు హీరో గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకోవటం అనేది చాలా గొప్ప విషయం. హిట్, ప్లాఫ్ అనేది పక్కన పెట్టి, మన సినిమా ప్రపంచ స్థాయికి వెళ్లినందుకు సంతోష పడాలి

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *