MOVIE

బ్రేకింగ్ న్యూస్ :ఇక నుండి జబర్దస్త్ కి గుడ్ బై చెప్పనున్న రోజా…అందుకు కారణం అతనేనటా…

రోజా..ఈ పేరు వినగానే కొందరికి గుండెల్లో రైళ్లు పరుగెత్తుతాయి. సినిమా దర్శకులకు కూడా ఈమె అంటే ఇప్పటికి కుయిదా భయపడే వాళ్ళు వున్నారంటే నిజంగానే ఆశ్యర్యకరమైన విషయమేనండోయ్…కేవలం తన జీవితాన్ని సినీ రంగంవైపే కాకుండా అటు బుల్లితెర, రాజకీయాలపై కూడా తన విశ్వ రూపాన్ని చూపుతూ అన్నిట్లో కూడా తన సత్తాను చాటుకుంటూ వచ్చింది ఫైర్ బ్రాండ్ రోజా..అయితే తాజా సమాచారం ప్రకారం ఆమె జబర్దస్త్ కు గుడ్ బై చెప్పనుంది టాక్ వినిపిస్తుంది.అసలు వివరాల్లోకి వెళ్తే….మంత్రివర్గంలో స్థానం దక్కకపోయినప్పటికీ రోజాకు ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌళిక సదుపాయాల సంస్థ (ఏపీఐఐసీ) చైర్మన్ పదవి దక్కింది. ఇది కేబినెట్ హోదా పదవి అని ప్రభుత్వం ప్రకటించింది. కొద్దిరోజుల క్రితం భర్త సెల్వమణితో కలిసి ఛాంబర్‌లోకి అడుగుపెట్టిన రోజా.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆమెకు అధికారులతో పాటు పలువురు అభినందనలు తెలిపారు. తాజాగా రోజా గురించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఆమె త్వరలోనే తెలుగు సినీ ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారన్నదే ఆ వార్త సారాంశం.

టాలీవుడ్‌లోని ఓ టాప్ హీరో నటిస్తున్న సినిమాలో కీలక పాత్ర కోసం రోజాను చిత్ర యూనిట్ సంప్రదించిందని తెలుస్తోంది. దీనికి ఆమె కూడా ఓకే చెప్పేశారని ఫిలింనగర్‌లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి జబర్ధస్త్ అభిమానులు ఫీలైపోతున్నారు. దీనికి కారణం ఆమె ఆ షోలో కనిపించరేమోనన్న బాధే. వాస్తవానికి జబర్ధస్త్ సక్సెస్ వెనుక నాగబాబు, రోజాల పాత్ర కూడా ఉంది. అందుకే వీళ్లిద్దరిని వదులుకోవడంలేదు సదరు షో నిర్వహకులు. రాజకీయాల్లో బిజీగా ఉన్న సమయంలో గ్యాప్ తీసుకున్నట్లు సినిమా చేస్తే షో నుంచి తప్పుకుంటారేమోనని రోజా అభిమానులు ఫీలైపోతున్నారని టాక్. మరి నిజంగానే ఆమె ఆ షో కు వీడ్కోలు చెప్పనుందా లేదా అనేది అయితే ఇంకా అధికారిక ప్రకటన మాత్రం రాలేదనే చెప్పాలి అది కూడా స్వయానా రోజానే వివరించాల్సి ఉంటుంది. ఇక నాగబాబు మీద కూడా అప్పట్లో ఇలాంటి న్యూస్ చాలా వచ్చాయి కానీ వాటన్నిటికీ చెక్ పెట్టేసి మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వడంతో షోలో కల కూడా వచ్చిందనే చెప్పాలి. మరి ఈ వరః ఎంత వరకు కరెక్టో తెలియాల్సివుంది.

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *