MOVIE

సిగ్గు లేకుండా నైట్ కి ఎంతిస్తే వస్తావు అంటున్నారు నాతో డాష్ నా కొడుకులు : రష్మీ గౌతమ్

బుల్లితెరపై మంచి క్రేజ్ ను సంపాదించుకున్న రష్మీ గౌతమ్ తన నటన పరంగానే కాకూండా అందాల ఆరబోతతో కూడా కుర్రకారుని ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ అయితే తాజాగా ఆమె పలు ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు ఈ నేపథ్యంలో ఆమె ఎదుర్కొన్న ఒక షాకింగ్ ఘటన గురించి మీడియా ముందు వెల్లడించారు. తాజాగా తన అభిమానులతో వీడియో ఛాట్ చేసింది రష్మీ గౌతమ్. తనకు ఫీవర్ గా ఉందని, ముఖం సరిగా లేదని అందుకే ఫిల్టర్ పెట్టి ఈ వీడియో చాట్ లో పాల్గొంటున్నాని తెలుపుతూ చాట్ ప్రారంభించింది రష్మీ. అయితే ఈ చాట్ లో కొందరు రష్మీని అసభ్యకరమైన ప్రశ్నలు అడగటంతో ఓ రేంజ్‌లో ఫైర్ అయింది రష్మీ గౌతమ్. కొందరు పిచ్చి రాతలు రాస్తూ తనకు అసభ్యకర మెసేజీలు పెడుతున్నారని, అయితే తాను మెచూర్డ్ కాబట్టి అలాంటివేమీ పట్టించుకోనని చెప్పింది రష్మీ. ఆ మెసేజెస్ తనపై పెద్దగా ప్రభావం కూడా చూపవని ఆమె అంటోంది.

అలా మెసేజీలు పెట్టేవారి గురించి పట్టించుకోకపోయినా కూడా.. ఆ మెసేజీలు సమాజంలో ఎక్కిస్తున్నారని, అలాంటి పిచ్చికుక్కల వల్లే ప్రస్తుతం అమ్మాయిలు బాహాటంగా మాట్లాడలేక పోతున్నారని రష్మీ అంటోంది. తాను పబ్లిక్ ఫిగర్‌ని పైగా ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి తనకు మాత్రమే ఈ మెసేజీలు వస్తున్నాయని అనుకోవడం పొరపాటే. తనకే కాదు రెగ్యులర్ ఉద్యోగాలు చేస్తున్న ఎందరో అమ్మాయిలపై ఇలాంటి ఆకతాయిల దాడి జరుగుతోంది. నైట్ ఎంతిస్తే వస్తావు? ఎన్ని డబ్బులు కావాలి? అంటూ వల్గర్ కామెంట్స్ చేస్తున్నారు అని రష్మీ తెలిపింది. అయినా నేనెందుకు వస్తాను.. అలా వస్తావా అని అడగటానికి మీకు సిగ్గు లేదా నీకు అంటూ రెచ్చిపోయింది రష్మీ. మీ కోరికలు హద్దు దాటుతున్నాయి. నేను మీలాంటి వారిని ఎందుకు పట్టించుకుంటాను. ఆ మాత్రం కూడా కామన్ సెన్స్ లేదా మీకు? అయినా నేను నా ఒక్క దాని గురించే మాట్లాడటం లేదు.

ఇలాంటి బాధలు పడుతున్న ఎందరో అమ్మాయిల గురించి మాట్లాడుతున్నా అంటూ ఫైర్ అయింది రష్మీ. సెక్స్ అనే విషయంలో అమ్మాయిని మాత్రమే ఎందుకు హైలైట్ చేస్తున్నారు? అబ్బాయిని దాచేయడం ఎందుకు అంటూ రెచ్చిపోయింది రష్మీ. అబ్బాయిని కూడా ఎందుకు అడగరు. నువ్ వర్జినిటీ ఎంతమందితో పోగొట్టుకున్నావ్ అంటూ సిగ్గు లేకుండా అమ్మాయిలనే అడుగుతారు. అబ్బాయిలను అడగటం అయితే ఎక్కడా చూడలేదు. ఏంటి అమ్మాయి సెక్స్ చేస్తే తప్పు.. అదే అబ్బాయి చేస్తే తప్పు లేదా? అంటూ ఓ రేంజ్‌లో సెన్సేషన్ సృష్టించింది రష్మీ. సమాజంలో అమ్మాయిలను తప్పుబడుతారు కానీ అలా చేసే ముందు ఒక్కసారి ఆ అమ్మాయి ఎందుకలా చేసింది,అసలు దీని వెనుక గల కారణం ఎవరో కూడా తెలుసుకోవాల్సి ఉంటుందని రేష్మి ఫైర్ అయ్యారు. నేటి సమాజంలో మహిళలకు అస్సలు ఫ్రీడమ్ అనేదే లేకుండా చేస్తున్నాయి మీ మగజాతి వారు వారికి కూడా మాలాంటి కష్టాలు ఉంటే తెలుస్తాది మేము పడే భాధలు ఎంత నరకంగా ఉంటాయో కానీ ఒక్క డాష్ నా కొడుకులు కూడా దీన్ని పట్టించుకోరు అంటూ తన ఆవేదనను మరోసారి మీడియా ముంది వెల్లడించారు రేష్మి.

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *