MOVIE

మహేష్ గాడి సంగతి నేను చూసుకుంటా..నిన్నే అంటాడా..? పునర్నవి కోసం రాహుల్ దారుణమైన నిర్ణయం

బిగ్ బాస్ హౌస్ లో మొన్న ఆదివారం స్పెషల్ గెస్ట్ గా వెన్నెల కిషోర్ వచ్చి, హౌస్ మేట్స్ అందరి గురించి చెపుతూ రాహుల్ విషయానికి వచ్చేసరికి, అన్న నీ మీద బయట టాక్ ఒక రకంగా రావటం లేదు. మంచి పులిహోర రెసిపీ అంటున్నారు అంటూ వెన్నెల కిషోర్ చెప్పాడు. అలా ఎందుకు చెప్పాడో అందరికి తెలుసు, హౌస్ లో పునర్నవి,రాహుల్ మధ్య ఎదో నడుస్తుందని బయట జనాలు గట్టిగానే మాట్లడుకుంటున్నారు. దానికి తగ్గట్లే వీళ్లిద్దరు హౌస్ లో బిహేవ్ చేస్తున్నారు. తాజాగా పునర్నవి పర్సనల్ గా రాహుల్ తో మాట్లాడుతూ కిచెన్ డ్యూటీ విషయంలో హౌస్ మేట్స్ మధ్య జరిగిన దాని గురించి చెపుతూ, ఎవరికీ వచ్చు అక్కడ వంట, శ్రీముఖి రసం పెడితే ఎలా ఉంటుంది.

నువ్వు అసలు తాగావా..? ఆ మహేష్ గాడికి ఏమి వచ్చు, తినటం, తిరగటం తప్ప ఏమి రాదు. ఇక పర్మినేట్ వంట మనిషిగా బాబా భాస్కర్ ఉన్నారు. అంటూ పునర్నవి మాట్లాడటంతో సరేలే నచ్చకపోతే మనం చేసేది చేద్దాం, వాళ్ళకి నేను ఇస్తాను గట్టిగా, చుక్కలు చూపిస్తా అంటూ పునర్నవి తో రాహుల్ మాట్లాడాడు, ఇవి గమనిస్తే కేవలం పునర్నవి కోసమే రాహుల్ ఇలా పక్క వాళ్ళని టార్గెట్ చేస్తూ హౌస్ లో గేమ్ ఆడుతున్నాడు. ఇవన్నీ చూస్తున్న వాళ్ళకి వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఎక్కడికో వెళ్లినట్లు తెలుస్తుంది. క్లోజ్ గా మూవ్ అవటం తప్పు కాదు, కానీ వాళ్ళ కోసం గేమ్ ఆడటం , వాళ్ళ కోసమే పక్కవాళ్ళని టార్గెట్ చేయటం కరెక్ట్ కాదు. రాహుల్ ఎప్పుడు తెలివి తెచ్చుకొని గేమ్ ఆడుతాడో ఏమిటో

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *